Skip to content
Movies

‘ ది రెడ్ బ్యాగ్’ సినిమా చిత్రీకరణ పూర్తి

May 2, 20264 second read

డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథతో ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను టీం పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిలోనూ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

కాన్సెప్ట్ పోస్టర్‌లో ఇచ్చిన డీటైల్స్, వదిలిన హింట్స్‌తో ‘ది రెడ్ బ్యాగ్’ మీద బజ్ క్రియేట్ అయింది. చేతినిండా రక్తం.. ఆ బ్యాగుని పట్టుకున్న తీరు, పోస్టర్‌లో ఉన్న కత్తులు, గన్నులు, రక్తంతో నిండిన ఆ ప్రాంతం ఇలా అన్నింటిని చూస్తే యాక్షన్ లవర్స్‌కి ట్రీట్ ఇచ్చేలా సినిమా ఉండబోతోందని అర్థం అవుతోంది.

రీసెంట్‌గా థాయ్‌లాండ్‌లో సినిమా టీం కీలక సన్నివేశాల్ని, ఓ పాటను షూట్ చేసింది. థాయ్‌లాండ్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సీన్స్ సినిమాకి హైలెట్‌గా నిలవనున్నాయి. ఇక ఈ చిత్రంలో కబీర్ సింగ్ ఓ డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నారు. ఇంత వరకు ఆయన్ను అలాంటి ఓ పాత్రలో ఆడియెన్స్ చూసి ఉండరు. ఇక ఈ మూవీలో కబీర్ సింగ్‌తో పాటుగా ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు నటించారు.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీజర్‌ను రెడీ చేస్తున్నట్టుగా టీం తెలిపింది. ఇక టీజర్‌తో మూవీపై మరింత బజ్ క్రియేట్ కానుంది. తొలి సినిమానే అయినా, నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ మోపురి సంగీతమందించగా.. ప్రియేష్ గురుసామి కెమెరామెన్‌గా, శివ శర్వాని ఎడిటర్‌గా పని చేశారు.

నటీనటులు : కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి తదితరులు

సాంకేతిక బృందం

నిర్మాత : హరికృష్ణ సోమిశెట్టి
దర్శకుడు : రవి కుమార్ సీరపు
సంగీతం : శేఖర్ మోపురి
కెమెరా : ప్రియేష్ గురుసామి
ఎడిటింగ్ : శివ శర్వాని
రచన : విక్రమ్ రాజా
లైన్ ప్రొడ్యూసర్ : నితిన్ కుమార్ ఆర్
ప్రొడక్షన్ కంట్రోలర్ : ప్రియ
పీఆర్వో : సాయి సతీష్

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top