Skip to content

‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించాలి.. హరీష్ శంకర్!

ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. ఈ సిరీస్‌ను జీ5లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..

హరీష్ శంకర్ మాట్లాడుతూ .. ‘‘మా నిర్మాత రమేష్ పుప్పాల గారిని మళ్లీ ఇలా చూడటం ఆనందంగా ఉంది. ‘మిరపకాయ్’ టైంలో రమేష్ గారు నన్నెంతో ఎంకరేజ్ చేశారు. రాజా రవీంద్ర సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. వివేక్ కూచిభోట్ల గారు నా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు. వివేక్ గారి శ్రీమతి సూర్యకాంతి గారు ఈ సిరీస్‌తో నిర్మాతగా రానున్నారు. డైరెక్టర్ శశి గారు ఈ సిరీస్‌తో గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ‘రుద్రవనం పీఎస్’ కంటెంట్ నేను చూశాను. ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నరేష్ అగస్త్య మాట్లాడుతూ .. ‘‘పన్నెండేళ్ల క్రితం జీ5లో ‘పసుపు కుంకుమ’తో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘పరువు’, ‘వికటకవి’ చేశాను. ఇప్పుడు ‘రుద్రవనం పీఎస్’ అంటూ రాబోతోన్నాం. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన జీ5 టీంకు థాంక్స్. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సూర్యకాంతి గారికి, రమేష్ గారికి థాంక్స్. శశితో నేను ఎన్నో కథల్ని చర్చించాను. అతని వద్ద ఇంకా చాలా గొప్ప గొప్ప కథలున్నాయి. శశి, అష్కర్ ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపారు. ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. అక్టోబర్ 30 నుంచి ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ .. ‘‘రుద్రవనం పీఎస్’ క్రైమ్, థ్రిల్లర్‌గా రాబోతోంది. ప్రతీ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తెలుగులో గొప్ప క్రైమ్, థ్రిల్లర్‌గా నిలుస్తుంది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన జీ5 టీంకి, నా నిర్మాతలు, నా ఆర్టిస్టులకు థాంక్స్. జీ5లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

నిర్మాత రమేష్ మాట్లాడుతూ .. ‘‘రుద్రవనం పీఎస్’ సిరీస్‌ను మా దర్శకుడు శశి గారు అద్భుతంగా తెరకెక్కించారు. మా ప్రాజెక్ట్‌కి ఎంతో సపోర్ట్ చేసిన జీ5 టీంకి థాంక్స్. హరీష్ శంకర్ గారి వల్లే నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఈ రోజు మా కోసం ఆయన రావడం ఆనందంగా ఉంది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీంకి థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత సూర్యక్రాంతి మాట్లాడుతూ .. ‘‘రుద్రవనం పీఎస్’లోని ప్రతీ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా ఉంటుంది. జీ5 టీం ఇచ్చిన సపోర్ట్‌ని మేం ఎప్పుడూ మర్చిపోలేం. మా కోసం వచ్చిన హరీష్ శంకర్ గారికి థాంక్స్. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు. అక్టోబర్ 30 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

వివేక్ కూఛిబొట్ల మాట్లాడుతూ .. ‘‘మాకు ఈ అవకాశం ఇచ్చిన జీ5 టీంకు థాంక్స్. నరేష్ అగస్త్య గారు మాకు ఎంతో సహకరించారు. ‘రుద్రవనం పీఎస్’ మంచి సిరీస్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు

శ్రావణి రెడ్డి మాట్లాడుతూ .. ‘‘రుద్రవనం పీఎస్’లో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. అగస్త్యతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అష్కర్ మా అందరినీ చక్కగా చూపించారు. మా ఈ క్రైమ్, థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంటుంది. జీ5లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది’ అని అన్నారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ .. ‘‘నిర్మాత రమేష్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటి సుగాలి సిలోని మాట్లాడుతూ .. ‘‘రుద్రవనం పీఎస్’లో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ నాకెంతో సహకరించారు. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

“`html

తారాగణం

నరేష్ అగస్త్య, బెనర్జీ, శివ ఆలపాటి, సుగాలి సిలోని, రమేష్ కోనంభొట్ల, నారాయణ స్వామి, శ్రావణి రెడ్డి, చారు వాకన్, ప్రీతీ సుందర్ తదితరులు

సాంకేతిక సిబ్బంది

బ్యానర్స్ ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్
నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి
దర్శకుడు శశిధర్ మున్నంగి
రచయిత తాజ్ సయ్యద్
సినిమాటోగ్రఫీ అష్కర్ అలీ
ఎడిటర్ మాధవ్
ప్రొడక్షన్ డిజైనర్ ఆశిష్ తేజపులాల
పీఆర్వో బియాండ్ మీడియా (నాయుడు – ఫణి)

“`

Back To Top