Skip to content
Movie Schedules

కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం విజయవంతం

May 4, 20264 second read

కేరళలో అల్లు అర్జున్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ ఫ్యాన్స్ మీటింగ్ లో అసోసియేషన్ ను మరింత బలపర్చడం, విస్తరించడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులకు చేరువకావడంపై డిస్కషన్స్ చేశారు.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) దేశంలో అతిపెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ గా ఏర్పడింది. అన్ని ప్రాంతాల్లో ఏఏఎఫ్ఏ తమ కార్యక్రమాలను చేపడుతోంది. సౌత్ ఇండియాలో సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇకపై నార్త్ ఇండియాలోనూ తమ యాక్టివిటీస్ చేసేందుకు సిద్ధమవుతోంది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు.

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top