Skip to content
Movies

అంచ‌నాలను రెట్టింపు చేసిన వెర్స‌టైల్ స్టార్‌ ధ‌నుష్ ‘క‌ర‌’ ట్రైల‌ర్‌.. ఏప్రిల్ 30న మూవీ గ్రాండ్ రిలీజ్

ఏప్రిల్ 28, 20269 second read

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ‘క‌ర‌’ తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. గ‌ల్ఫ్ దేశాల‌పై ఇరాన్ గ‌తంలో చేసిన యుద్ధానికి సంబంధించిన వార్త‌లు రేడియోలో వినిస్తుంటాయి. మ‌రోవైపు మ‌న దేశంలోనే కాదు..ప్ర‌పంచం ఆర్థిక ప‌రిస్థితుల‌కు స‌మ‌స్య‌గా మారుతుంద‌ని స‌ద‌రు వార్త‌ల సారాంశం. అదే క్ర‌మంలో మ‌న ద‌గ్గ‌ర రైతులు పంట‌ల‌ను త‌గలబెట్టేస్తుంటారు. మ‌రో సీన్‌లో ఓ చిన్న టౌన్‌లోని బ్యాంకుని చూపిస్తారు.

ఆ బ్యాంకుతో పాటు మ‌రో బ్యాంకుని ఓ వ్య‌క్తి దోపీడీ చేస్తాడు. దీంతో పోలీసులు దొంగ‌ను ప‌ట్టుకోవ‌టానికి రంగ ప్ర‌వేశం చేస్తారు. ఆ స‌న్నివేశాల‌ను చూపించే క్ర‌మంలోనే ధ‌నుష్ పాత్ర‌ను సింపుల్‌గా చూపించారు. అయితే అందులోని ఇంటెన్స్ చాలా గొప్ప‌గా కనిపిస్తుంది. ధ‌నుష్ పాత్ర దేని కోస‌మో వెతుకుంటుంది. త‌న‌ను అంద‌రూ దొంగ అని అనుకుంటుంటారు. అందుకు కార‌ణం కొన్నేళ్లుగా హీరో ఊరికి దూరంగా ఉంటాడు. అలాంటి వ్య‌క్తి మ‌ళ్లీ ఊరికి రావ‌టంపై కొంద‌రు అనుమానాన్ని వ్య‌క్తం చేస్తారు. ఇంత‌కీ ధ‌నుష్ నిజంగానే బ్యాంకుల్లో దొంగ‌త‌నం చేశాడా? పోలీసులు అనుమానం ఎవ‌రి వైపు ఉంటుంది? చివ‌రికి ధ‌నుష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడ‌నేది తెలుసుకోవాలంటే మాత్రం ఏప్రిల్ 30న రిలీజ్ అవుతోన్న ‘క‌ర‌’ సినిమాను చూడాల్సిందే.

ప్ర‌తి సినిమాలోనూ వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించే ధ‌నుష్ క‌ర సినిమాలోనూ డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌నేది ట్రైల‌ర్‌ను చూస్తుంటే తెలుస్తుంది. త‌న క్యారెక్ట‌ర్‌లోని వేరియేష‌న్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. డైరెక్ట‌ర్ విఘ్నేష్ రాజా సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో రూపొందించారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జి.వి.ప్ర‌కాష్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్.. తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మేజ‌ర్ హైలైట్స్‌. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింప‌య్యాయి.

నటీనటులు : ధనుష్, మమిత బైజు, కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి & ఇతరులు.

సాంకేతిక బృందం
బ్యానర్ : విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ – ఆర్ స్టార్ లాజిస్టిక్స్
రచన : విఘ్నేశ్ రాజా, ఆల్‌ఫ్రెడ్ ప్రకాష్
దర్శకుడు : విఘ్నేశ్ రాజా
సంగీతం : జీవీ ప్రకాష్
డీఓపీ : థేనీ ఈశ్వర్
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
కార తెలుగు రిలీజ్: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్
పీఆర్వో (తెలుగు): బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి)
డిజిటల్ మార్కెటింగ్ (తెలుగు) : విష్ణు తేజ్ పుట్టా
ఈవెంట్ పార్టనర్ (తెలుగు) : యు వి మీడియా

Share this Article

Related Articles

వ్యాఖ్యలు లేవు

Comments (0)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back To Top