మెహిదీపట్నంలోని శ్రీచైతన్య స్కూల్‌లో శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు బి.ఎస్. రావు మూడో వర్ధంతిని సోమవారం ఘనంగా…

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి– ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ ఎన్.స్వాతి
శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు బి.ఎస్. రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రదానోత్సవాన్ని మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బి.ఎస్. రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా వార్షిక క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి.కృష్ణ, ఆర్‌ఐ ఎన్.స్వాతి మాట్లాడుతూ–‘‘విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. తద్వారా నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ కోఆర్డినేటర్ జనార్ధన్, డీన్ శ్రీ మల్లేష్, ఇన్ చార్జెస్ యాదగిరి, అరుణతో, పీఈటీ అనిత, కృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
