మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో స్మార్ట్ లివింగ్‌లో భాగంగా ‘మిషన్ హరితోదయ’ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు…

మెహిదీపట్నం శ్రీచైతన్యలో ఘనంగా బి.ఎస్. రావు వర్ధంతి

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య స్కూల్‌లో శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు బి.ఎస్. రావు మూడో వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బి.ఎస్. రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మెహిదీపట్నం జోన్ ఏజీఎం బి. కృష్ణ మాట్లాడుతూ, బి.ఎస్. రావు విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం నిర్వహించిన చిత్రలేఖన పోటీలు విశేష ఆకట్టుకున్నాయి. బి.ఎస్. రావు ఆదర్శాలు, విద్య పట్ల ఆయన అంకితభావాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు రూపొందించిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించి ప్రోత్సహించింది. కార్యక్రమంలో ఆర్‌ఐ ఎన్. స్వాతి, కోఆర్డినేటర్ జనార్ధన్, డీన్ మల్లేష్, ఇన్‌చార్జెస్ యాదగిరి, అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని బి.ఎస్. రావుకు ఘనంగా నివాళులర్పించారు.

