Skip to content

గర్భధారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు – డా. విద్యా శ్రీ సూచనలు

గర్భం నిర్ధారణ అయిన వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజ్, మహబూబ్‌నగర్‌కు చెందిన గైనకాలజిస్ట్ డా. విద్యా శ్రీ సూచిస్తున్నారు. గర్భిణులు సమతుల ఆహారం తీసుకుంటూ ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలను వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి. తగినంత విశ్రాంతి, మంచి నిద్ర, తేలికపాటి వ్యాయామం మరియు తగినంత నీరు తీసుకోవడం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో అవసరం. ధూమపానం, మద్యపానం, స్వయంగా మందులు వాడటం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. రక్తస్రావం, తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం, నీరు కారడం లేదా బిడ్డ కదలికలు తగ్గితే వెంటనే ఆసుపత్రిని సంప్రదించాలి. ప్రసవానికి ముందుగానే అవసరమైన వైద్య రికార్డులు, ఆసుపత్రి బ్యాగ్ సిద్ధంగా ఉంచుకోవాలి. అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ శస్త్రచికిత్సను వైద్యులు సూచిస్తారని డా. విద్యా శ్రీ తెలిపారు. సిజేరియన్ అనంతరం పరిశుభ్రత పాటిస్తూ వైద్యుల సూచించిన మందులు వాడి, బరువైన వస్తువులు ఎత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా తల్లిపాలను ప్రారంభించడం శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సకాలంలో వైద్యులను సంప్రదించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డా. విద్యా శ్రీ తెలిపారు.

డా. విద్యాశ్రీ గడలే గారు వైద్య సేవలకు అంకితమైన కుటుంబంలో కోడలిగా ఉండటం ఆమె అదృష్టం. ఆమె అత్తమామలు డా. వెంకటేశ్వరరావు గడాలి గారు, డా. ప్రభ గడాలి గారు ప్రముఖ వైద్యులు కాగా, ఆమె భర్త డా. రవికిరణ్ గడాలి గారు వైద్యుడిగానే కాకుండా త్వరలో థియేటర్లలో విడుదల కానున్న తెలుగు చిత్రం ది మేజ్ దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుతున్నారు.

Back To Top