ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక…

పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు అందిస్తున్న చికిత్స, కోలుకునే ప్రక్రియ గురించి ఆరా తీసిన చంద్రబాబు నాయుడు, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొంతసేపు పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న వైద్య బృందంతోనూ మాట్లాడిన ముఖ్యమంత్రి, చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం.
