చెన్నై నగరంలో ప్రముఖ వెల్‌నెస్ & హెల్త్‌కేర్ సంస్థ “కలర్స్” తన సేవలను మరింత విస్తరిస్తూ వెలచెర్రీలో అత్యాధునిక సదుపాయాలతో…

నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ గ్రాండ్ ఓపెనింగ్
హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో మరో ప్రీమియం బ్యూటీ & వెల్‌నెస్ డెస్టినేషన్‌గా ‘ల్యూరా హెయిర్ | బ్యూటీ | నెయిల్స్ | స్పా | లాంజ్’ గ్రాండ్‌గా ప్రారంభమైంది. బొటానికల్ గార్డెన్ రోడ్‌లో ప్రారంభమైన ఈ లగ్జరీ సలోన్‌ను ప్రముఖ నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ప్రారంభించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఓపెనింగ్ వేడుకకు బ్యూటీ ప్రియులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, మీడియా ప్రతినిధులు, పలువురు ఆహ్వానితులు హాజరై సందడి చేశారు. ఆధునిక సౌకర్యాలు, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో రూపొందించిన ల్యూరా.. హెయిర్, బ్యూటీ, నెయిల్స్, స్పా, లాంజ్ సేవలను ఒకే చోట అందిస్తూ నగర ప్రజలకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సేవలను విలాసవంతమైన వాతావరణంలో అందించాలనే లక్ష్యంతో ల్యూరాను ప్రారంభించినట్లు తెలిపారు. ముఖ్యంగా కస్టమర్ కంఫర్ట్, హైజీన్, ప్రీమియం సర్వీసులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ జయ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో లగ్జరీ బ్యూటీ & వెల్‌నెస్ రంగంలో ల్యూరా ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. త్వరలో మరిన్ని బ్రాంచ్‌లతో విస్తరించాలనే ప్రణాళిక కూడా ఉందని వెల్లడించారు.
ఇక నటి పూజా రామచంద్రన్ మాట్లాడుతూ.. ల్యూరా కాన్సెప్ట్ ఎంతో ఆకట్టుకుందని, హైదరాబాద్‌కు ఇలాంటి ప్రీమియం బ్యూటీ స్పేస్ అవసరమని పేర్కొన్నారు. ఆధునికత, సౌకర్యం, ప్రశాంతత కలిసిన ఈ స్పేస్ బ్యూటీ & వెల్‌నెస్ ప్రియులకు మంచి ఎంపికగా మారుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రారంభోత్సవం అనంతరం ఆమె అతిథులు, మీడియాతో ఆప్యాయంగా ముచ్చటించారు. మొత్తంగా ల్యూరా ప్రారంభం హైదరాబాద్ బ్యూటీ & వెల్‌నెస్ రంగంలో మరో కొత్త అడుగుగా నిలిచిందని చెప్పాలి.




Comments (0)