Skip to content

హీరోయిన్ ప్రియ భవానీ శంకర్ చేతుల మీదుగా వెలచెర్రీలో “కలర్స్ 2.0” వెల్నెస్ సెంటర్ ప్రారంభం

చెన్నై నగరంలో ప్రముఖ వెల్నెస్ & హెల్త్‌కేర్ సంస్థ “కలర్స్” తన సేవలను మరింత విస్తరిస్తూ వెలచెర్రీలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన “కలర్స్ 2.0” వెల్నెస్ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించింది. మహేశ్వరీ నగర్‌లోని 100 ఫీట్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రీమియం సెంటర్‌ను సౌతిండియా హీరోయిన్ Priya Bhavani Shankar ప్రియ భవానీ శంకర్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం రిబ్బన్ కట్ చేసి సెంటర్‌ను ప్రారంభించిన ఆమెకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియ భవానీ శంకర్, నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ సవాలుగా మారిందని అన్నారు. అందం అనేది కేవలం బాహ్య రూపానికి మాత్రమే పరిమితం కాదని, ఆరోగ్యకరమైన జీవన విధానం, సరైన ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టడం ద్వారా నిజమైన అందం వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. బరువు నియంత్రణ, చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారికి ఇలాంటి ప్రత్యేక వెల్నెస్ సెంటర్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసాన్ని సంపాదించిన తమ సంస్థ ఇప్పుడు తమిళనాడులో కూడా వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. కుంభకోణం తర్వాత చెన్నైలో మరో ప్రీమియం సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గత 22 ఏళ్లుగా వెల్నెస్ రంగంలో సేవలందిస్తున్న తమ సంస్థ బరువు నియంత్రణ ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే ప్రత్యేక ప్రోగ్రామ్‌లను అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం తమ సంస్థలో 250 మందికి పైగా న్యూట్రిషనిస్టులు, వందమంది నిపుణులైన వైద్యులు, 2000 మందికి పైగా శిక్షణ పొందిన టెక్నీషియన్లు సేవలందిస్తున్నారని వెల్లడించారు. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన పరికరాలతో అంతర్జాతీయ స్థాయి వెల్నెస్ సేవలను “కలర్స్ 2.0” ద్వారా అందిస్తున్నామని చెప్పారు.

మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య అవసరాలు మారుతున్న నేపథ్యంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ సెంటర్‌ను రూపొందించామని తెలిపారు. చెన్నై ప్రజల జీవనశైలిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వెల్నెస్ ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, డెర్మటాలజీ మరియు వెల్నెస్ సేవలను సమగ్రంగా అందిస్తున్న సంస్థగా “కలర్స్” ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. నిపుణులైన డెర్మటాలజిస్టులు, ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన సిబ్బందితో నాణ్యమైన సేవలను అందించడం తమ లక్ష్యమని తెలిపారు. 5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వెల్నెస్ రంగ నిపుణులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెలచెర్రీలో ప్రారంభమైన “కలర్స్ 2.0” ద్వారా అత్యాధునిక వెల్నెస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top