Skip to content
Movies

వేదవ్యాస్ సినిమా విజువల్ లోగో రిలీజ్ ఈవెంట్ హైలైట్స్!

May 3, 20269 second read

ప్రముఖ దర్శకులు S.V.కృష్ణారెడ్డి దర్శకత్వంలో “వేద వ్యాస్ ” చిత్రాన్ని నిర్మిస్తున్న సంస్థ “సాయి ప్రగతి ఫిలిమ్స్ ” బ్యానర్ విజువల్ లోగో ఆవిష్కరణ మే 2 వ తేదీ సాయంత్రం ఘట్కేసర్ లోని KPRIT విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. షిర్డీ సాయిబాబా విగ్రహానికి నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, S.V. కృష్ణారెడ్డి , K అచ్చిరెడ్డి కలసి పూజ చేస్తున్న దృశ్యాన్ని బ్యానర్ లోగోలో చిత్రీకరించారు . వేద వ్యాస్ సినిమా నిర్మాత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి KPRIT సంస్థల చైర్మన్ గా వ్యవహారిస్తున్న వేడుకకు 4 వేలకు పైగా విద్యార్థిని , విద్యార్థులు హాజరయి కేరింతలు కొడుతూ వేద వ్యాస్ యూనిట్ కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేసారు . ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రతాప్ రెడ్డి తో పాటు దర్శకులు S V కృష్ణారెడ్డి , సమర్పకులు K అచ్చిరెడ్డి , హీరో పిడుగు విశ్వనాధ్ , నటుడు రఘుబాబు, తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి శ్రీ రామ్ వెంకటేష్ ,KPRIT వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, KPRIT సెక్రటరి రాకేష్ రెడ్డి మరియు అనేకమంది అతిధులు హాజరయి “వేద వ్యాస్” సినిమా విజయవంతం కావాలని అభిలషిస్తూ ప్రసంగించారు.

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top