Skip to content
Movies

కింగ్ నాగార్జున, రా. కార్తీక్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మక చిత్రం #కింగ్100 లో జాయిన్ అయిన టబు

ఏప్రిల్ 28, 20269 second read

కింగ్ నాగార్జున 100వ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ #King100 అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. దర్శకుడు రా. కార్తిక్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా, నాగార్జున సినీ ప్రయాణానికి పర్ఫెక్ట్ సెలబ్రేషన్‌గా ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది.

ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తెచ్చేలా నటి టబు కీలక పాత్రలో జాయిన్ అయ్యారు. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నాగార్జున, టబులది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ జోడీ మళ్లీ తెరపై కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

నాగార్జున–టబు కాంబినేషన్ లో ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. ‘శిశింద్రీ’లో కూడా ఆమె ప్రత్యేకంగా కనిపించారు. ఇప్పుడు #King100లో వీరి రీయూనియన్ మరోసారి ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయబోతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

నటీనటులు: కింగ్ నాగార్జున, టబు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: రా. కార్తీక్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో: వంశీ శేఖర్

Share this Article

Related Articles

వ్యాఖ్యలు లేవు

Comments (0)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back To Top