Skip to content

కొండకల్ అంగన్వాడి పిల్లలకు అండగా నిలిచిన నందమూరి జానకిరామ్ ట్రస్ట్

పిల్లల చిరునవ్వే సమాజానికి నిజమైన సంపద “అనే గొప్ప భావనతో, కొండకల్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల కోసం నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది.

అంగన్వాడి టీచర్ల విజ్ఞప్తి మేరకు చిన్నారుల సౌకర్యార్థం కుర్చీలు అందజేయడంతో పాటు, వారి ఆరోగ్యం, ఆనందాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రేమతో చిరు కానుకగా డ్రై ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది.

పిల్లలు దైవ స్వరూపులు..వారి చిరునవ్వుల్లోనే దేవుడి ఆశీర్వాదం కనిపిస్తుంది.చిన్నారుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే వారికి మెరుగైన విద్య, మంచి ఆరోగ్యం, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. వారి కోసం చేసే ప్రతి చిన్న సేవ భవిష్యత్తు భారత నిర్మాణానికి వేసే ఒక గొప్ప అడుగు.

ఈ సేవా కార్యక్రమంలో శ్రీమతి నందమూరి దీపిక జానకిరామ్ గారు స్వయంగా పాల్గొని చిన్నారులకు కుర్చీలు, డ్రై ఫ్రూట్స్ అందజేసి వారి ముద్దుల నవ్వులను, ఆశీర్వాదాలను అందుకున్నారు.

*సేవే మా సంకల్పం… చిన్నారుల సంక్షేమమే మా లక్ష్యం.*

*జై తెలుగు తల్లి!*

నందమూరి జానకిరామ్ ట్రస్ట్ “సేవే పరమో ధర్మః”

Back To Top