డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, పవర్ హౌస్ పెర్ఫార్మర్ విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మీ కౌర్, జెబి మోహన్ పిక్చర్స్ జెబి నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, రీ-రికార్డింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలలో అద్భుతమైన సంగీతాన్ని అందించిన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్, ‘స్లమ్ డాగ్’ 33 టెంపుల్ రోడ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌తో కలిసి రికార్డింగ్ స్టూడియోలో కూర్చొని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫోటో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
పూరి మార్క్ ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది. ఇప్పటికే ఈ ఎక్స్‌ప్లోసివ్ కాంబోపై భారీ అంచనాలు నెలకొనగా, మేకర్స్ త్వరలోనే మరిన్ని స్ట్రైకింగ్ అప్డేట్స్ ఇవ్వబోతున్నారు.
ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ లు హ్యుమరస్ పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో గ్రాండ్ పాన్-ఇండియా రిలీజ్ కానుంది.

| తారాగణం | |
|---|---|
| విజయ్ సేతుపతి | హీరో |
| సంయుక్త | హీరోయిన్ |
| టబు | ప్రధాన పాత్ర |
| విజయ్ కుమార్ | ఇతర నటుడు |
| సాంకేతిక సిబ్బంది | |
| రచన, దర్శకత్వం | పూరి జగన్నాధ్ |
| నిర్మాతలు | పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్, జెబి నారాయణరావు కొండ్రోళ్ల |
| సమర్పణ | ఛార్మీ కౌర్ |
| బ్యానర్ | పూరి కనెక్ట్స్ |
| సీఈఓ | విషు రెడ్డి |
| సంగీతం | హర్షవర్ధన్ రామేశ్వర్ |
| PRO | వంశీ-శేఖర్ |
| మార్కెటింగ్ | హాష్‌ట్యాగ్ మీడియా |
















Comments (0)