Skip to content

జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’

తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘బిచ్చగాడు’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి చేసిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రాన్ని జూన్ 19న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌లో విజయ్ ఆంటోని, స్వాసిక సైకిల్‌పై ప్రయాణిస్తున్న విజువల్స్ సినిమా కథ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందనే సంకేతాలను ఇస్తున్నాయి. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను సమపాళ్లలో మేళవించి దర్శకుడు శశి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. విజయ్ ఆంటోని సరసన స్వాసిక నటిస్తుండగా, అజయ్, కావ్య, శక్తి, బాలాజీ శక్తివేల్, అరుళ్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సాంకేతికంగా కూడా ‘వంద దేవుళ్ళు’ బలంగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. ఎస్.బి. దర్శన్ కిర్లోష్ అందించిన సినిమాటోగ్రఫీ, బాలాజీ శ్రీరామ్ స్వరపరిచిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. హరిష్ యువరాజ్ ఎడిటింగ్, భాష్య శ్రీ సంభాషణలు కథను మరింత ప్రభావవంతంగా మలిచాయని సమాచారం. ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

నటీనటులు
విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్,
దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
సమర్పణ ఫాతిమా విజయ్ ఆంటోని
నిర్మాత రామంజనేయులు జవ్వాజి
దర్శకుడు శశి
సంగీతం బాలాజీ శ్రీరామ్
డీఓపీ ఎస్. బి. దర్శన్ కిర్లోష్
ఎడిటర్ హరిష్ యువరాజ్
మాటలు భాష్య శ్రీ
పీఆర్వో సాయి సతీష్

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top