Skip to content
Movie Schedules

మే 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన సూర్య ‘వీరభద్రుడు’

May 9, 202614 second read

సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ భారీ అంచనాలని సృష్టించాయి.

ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీ.

2026 మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

వీరభద్రుడు – చిత్ర వివరాలు
తారాగణం సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శివాడ, సుప్రీత్ రెడ్డి
రచన & దర్శకత్వం RJ బాలాజీ
సినిమాటోగ్రఫీ జికె విష్ణు
సంగీతం సాయి అభ్యంకర్
యాక్షన్ అన్బరివ్ – విక్రమ్ మోర్
ఎడిటర్ ఆర్. కళైవానన్
ప్రొడక్షన్ డిజైన్ అరుణ్ వెంజారామూడు
నిర్మాతలు ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు
తెలుగు రిలీజ్ అన్నపూర్ణ స్టూడియోస్
పీఆర్వో వంశీ-శేఖర్
Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top