Skip to content
Movies

‘రాక్షసపురం’కు వస్తోన్న రెస్పాన్స్ ఆనందంగా ఉంది : కె.ఎస్. రామారావు

May 15, 202610 second read
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు తెలుగు ప్రేక్షకులకు అందించిన లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ రోజు (మే 15న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు వచ్చిన ‘రాక్షసపురం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

చిత్ర సమర్పకులు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ – ‘రాక్షసపురం’ చిత్రాన్ని 147కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశాం. సినిమా చూసిన వాళ్లు చాలా బాగుందని అంటున్నారు. కలెక్షన్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. కొన్ని చోట్ల ఇంకా పికప్ అవుతున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా స్నేహితుడు సతీష్ ఈ సినిమా చూడమని అడిగారు. మూవీ చూస్తుంటే కథ నేపథ్యం, ఐడియా చాలా బాగుందని అనిపించింది. క్రిస్టోఫర్ నోలన్ సిక్స్త్ సెన్స్ అనే సినిమాలోలా ఒక కొత్తదనం నిండిన సినిమా ‘రాక్షసపురం’ అనే ఫీల్ కలిగింది. సస్పెన్స్, మర్డర్ మిస్టరీ వెరైటీగా అనిపిస్తుంది. డైరెక్టర్ రవి సారంగ రూపొందించిన మంచి చిత్రమిది. ఇలాంటి చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్ కు అందించాలని డబ్బింగ్ చేసి రిలీజ్ చేశాను. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి యూత్ ఎక్కువగా అదే చూస్తున్నారు. ఏ సినిమాకూ ఆశించినంత కలెక్షన్స్ లేవు. మేము జూన్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నాం. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మే15న రిలీజ్ చేయాల్సివచ్చింది. అయినా మాకు మంచి రిజల్ట్ వచ్చింది. సినిమా బాగుందనే టాక్ వస్తోంది. ఈ చిత్రాన్ని తమదే అనేంతగా ముందుండి నడిపించిన మా రామసత్యనారాయణ గారికి కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రతి థియేటర్ వారితో మాట్లాడి ప్రేక్షకుల దగ్గరకు సినిమాను రామసత్యనారాయణ తీసుకెళ్లారు. ఈ సినిమాకు దక్కుతున్న సక్సెస్ కు కారణం డైరెక్టర్ రవి సారంగ, రామసత్యనారాయణ. మంచి ప్రచారం కల్పించిన సురేష్ కొండేకి థ్యాంక్స్. మా టీమ్ లో రామసత్యనారాయణ ఉంటారు. మేము మరిన్ని మూవీస్ చేస్తాం. చిన్న చిత్రం నిర్మిస్తే ఒక సమస్య, పెద్ద సినిమా నిర్మిస్తే మరో సమస్య ప్రొడ్యూసర్ కు ఎదురవుతోంది. ఒకప్పుడు ఏడాది పాటు ఆడిన సినిమాలు చూశాం. ఇప్పుడు ఎంత గొప్ప చిత్రమైనా వారం పదిరోజుల్లో థియేటర్స్ నుంచి తీసేస్తున్నారు. కొత్త నిర్మాతలు తమ సినిమాలను కూడా పెద్ద చిత్రాల్లాగే వందలాది థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ఆశిస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం లేదు. అన్నారు.

డైరెక్టర్ రవి సారంగ మాట్లాడుతూ – ఫిబ్రవరిలో మేము కన్నడలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం. నెల రోజుల తర్వాత కేఎస్ రామారావు గారు మా మూవీ చూశారు. ఇప్పుడు రిలీజ్ చేశారు. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన చిత్రాన్ని ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలంటే ధైర్యం కావాలి. అలాంటి ధైర్యమున్న ప్రొడ్యూసర్ రామారావు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా ప్రొడ్యూసర్ రవి వర్మ ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషనేట్ గా నిర్మించారు. కథ ఓకే అయ్యాక, ఆ కథకు కావాల్సిన ప్రతీది సమకూర్చారు. హీరో రాజ్ బి శెట్టి తన పూర్తి సహకారం అందిస్తూ నన్ను ఎంకరేజ్ చేశారు. వీరందరి సహకారంతో ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా మూవీని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కు కృతజ్ఞతలు. అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ – కె.ఎస్.రామారావు గారు అంటే నాకు గాడ్ ఫాదర్ లాంటివారు. ఆయన చేసిన చిత్రాలెన్నో ప్రేక్షకుడిగా చూసి ఆనందించాను. ఈ రోజు ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది. ఈ సినిమాను 147 థియేటర్స్ లో రిలీజ్ చేశాం. మార్నింగ్ షోస్ కంటే మ్యాట్నీ షోస్ కు కలెక్షన్స్ పెరిగాయి. ఇంకా మౌత్ టాక్ తో మరింతగా కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నాం. ఈ చిత్రాన్ని దర్శకుడు రవి సారంగ ఆకట్టుకునేలా రూపొందించాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మన ఊహకు అందకుండా సినిమా సాగుతుంటుంది. టీజర్, ట్రైలర్ తో మా మూవీ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి చేస్తున్న ప్రచారం, భారతీబాబు తెలుగు స్క్రిప్ట్, కేఎస్ రామారావు గారి పేరుకున్న ఇమేజ్ ఇవే మా సినిమా సక్సెస్ కు కారణం. అన్నారు.

నటీనటులు
తారాగణం రాజ్ బి శెట్టి తదితరులు
టెక్నికల్ టీమ్
దర్శకత్వం డాక్టర్ రవి
నిర్మాత కేఎస్ రామారావు
బ్యానర్ క్రియేటివ్ కమర్షియల్స్
Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top