ప్రముఖ కథానాయకుడు నితిన్ తదుపరి ఆసక్తికరమైన చిత్రం సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది.
నాణ్యమైన, విజయవంతమైన చిత్రాలను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రతిభావంతులైన దర్శకులు నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. బలమైన సృజనాత్మక బృందం ఏకమవ్వడంతో, ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ నిర్మాణ సంస్థల కలయికలో ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలు రావడంతో, ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుండి ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నద్ధమవుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
| విభాగం | వివరాలు |
|---|---|
| నటీనటులు | నితిన్, రితికా నాయక్ |
| సంగీతం | సురేష్ బొబ్బిలి |
| ఛాయాగ్రహణం | అనిత్ మదాడి |
| కళ | జానీ షేక్ |
| ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | ఎస్ వెంకటరత్నం (వెంకట్) |
| సహ నిర్మాతలు | ఉప్పుటూరి వెంకట్, వీఎంఆర్ |
| నిర్మాతలు | సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య |
| నిర్మాణ సంస్థలు | సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ |
| సమర్పణ | శ్రీకర స్టూడియోస్ |
| పి ఆర్ ఓ | లక్ష్మీవేణుగోపాల్ |















Comments (0)