రెండేళ్ల క్రితం వరకు శషి కూడా అందరిలాగే చదువుకుంటూ, ఆడుతూ పాడుతూ, ఎంతో ఆనందంగా గడిపిన ఓ చిన్నారి. కానీ…

కొల్లేరు సమస్య పరిష్కారానికి కీలక భేటీ
కొల్లేరు సమస్య కేవలం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, లక్షలాది మంది ఆక్వా రైతులు, స్థానిక ప్రజల జీవనోపాధితో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన ప్రజా సమస్య. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ (CEC) ఛైర్మన్ సీపీ గోయల్ గారిని విజయవాడ ఎయిర్‌పోర్టులో కలిసి, కొల్లేరు సమస్యపై సమగ్రంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతూ, అదే సమయంలో స్థానిక ప్రజల న్యాయసమ్మత హక్కులు, జీవనోపాధి దెబ్బతినకుండా పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా కాంటూరు కుదింపు అంశాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా త్వరితగతిన సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించాలని కోరడం జరిగింది. ఈ అంశంపై గోయల్ గారు సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా నివేదిక అందిస్తామని హామీ ఇవ్వడం స్థానిక ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. కొల్లేరు పరిరక్షణతో పాటు ప్రజల జీవన హక్కులను సమతుల్యం చేసే నిర్ణయం రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
