మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి…

‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదుగా ‘విహారి OTT’ స్పెషల్ ప్రివ్యూ విడుదల
తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా డిజిటల్ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది ‘విహారి OTT’. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదుగా ఈ ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ గ్లోబల్ విజన్‌ను ఆవిష్కరించడం విశేషంగా నిలిచింది. గత 18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ప్రపంచంలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు పరిచయం చేసిన విహారి, ఇప్పుడు పూర్తి స్థాయి OTT ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెందడం తెలుగు డిజిటల్ మీడియా రంగంలో కొత్త అడుగుగా భావిస్తున్నారు. ప్రపంచ దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు ప్రత్యేకతలు, జీవన విధానాలు, అందమైన ప్రయాణ అనుభవాలను మరింత ఆధునికంగా, ప్రపంచ స్థాయి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే విహారి OTT లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు టెలివిజన్‌లో విజయవంతమైన ట్రావెల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన విహారి, ఇప్పుడు తెలుగు భాషలో ట్రావెల్‌కే అంకితమైన తొలి OTT ప్లాట్‌ఫామ్‌గా జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుండటం ట్రావెల్ లవర్స్‌కు మంచి వార్తగా మారింది.
