Skip to content

అంచనాలు పెంచుతున్న సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్!

సుహాస్, సూరి ముఖ్య పాత్రలుగా ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ మూవీని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని సెప్టెంబర్ 10న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది.

ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ‘పందెమే మనల్ని కాపాడుతుంది.. పందెన్నీ మనం కాపాడటం లేదు’, ‘బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు’ అనే డైలాగ్స్, టీజర్‌లో చూపించిన విజువల్స్, బోట్ సీక్వెన్స్, పడవ పందెంలకు సంబంధించిన సీన్లు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక సుహాస్, సూరి పవర్ ఫుల్ ఎంట్రీలు, జీవీ ప్రకాష్ ఇచ్చిన బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. డైలాగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్ ఇలా అన్ని రకాలుగా ‘మండాడి’ ఇంటెన్స్‌గా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ఈ సినిమాని సెప్టెంబర్ 10న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Back To Top