‘క్రైమ్‌ను ఫాలో అయితే జరిగింది మాత్రమే తెలుస్తుంది.. కానీ క్రిమినల్ని ఫాలో అయితే జరగబోయేది కూడా తెలుస్తుంది’ అంటున్నారు రుద్రవనం…

‘సలార్ 2’ కోసం ప్రభాస్, ప్రశాంత్ నీల్ రీయూనియన్!
డైనోమైట్ ద్వయం.. వైలెంట్ మ్యాన్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి ‘సలార్: పార్ట్ 1 – సీజ్ఫైర్’తో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిని అందించారు. ప్రముఖ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ ఫ్రాంచైజీపై అంచనాలను మరింత పెంచుతూ ‘సలార్ 2’ సీక్వెల్‌ను ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా పనులు పూర్తయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రభాస్ తన బిజీ షెడ్యూల్లో వరుసగా పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు.
భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో, స్టార్ హీరోలను పవర్ఫుల్ మాస్ అవతార్ లో చూపించడంలో ప్రశాంత్ నీల్ తనదైన ప్రత్యేకస్టయిల్ ఏర్పరచుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ స్టయిల్ ఆయన సినిమాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ‘సలార్: పార్ట్ 1 – సీజ్ఫైర్’ సాధించిన అద్భుతమైన విజయంతో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్.. సీక్వెల్ పై అంచనాలను మరింత పెంచాయి. ఈ ఇద్దరి కలయికలో మరోసారి పవర్ఫుల్ యాక్షన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘సలార్ 2’కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.
