తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబినేషన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘బిచ్చగాడు’ వంటి…

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ నుంచి మెలోడీ టచ్‌తో ఆకట్టుకుంటున్న ‘నువ్వే కదా..’ పాట
వడ్డే జిష్ణు సమర్పణలో, వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే వినూత్న ప్రమోషన్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా జూన్ 19న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌తో పాటు ‘టా టా’ పాటకు లభించిన విశేష స్పందన సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ‘నువ్వే కదా..’ అనే మరో అందమైన మెలోడీ గీతాన్ని ఎఫ్‌ఎం రేడియో స్టేషన్‌లో విడుదల చేసింది. కళ్యాణ్ నాయక్ స్వరపరిచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, పీవీఎన్‌ఎస్ రోహిత్, హరిణి ఇవటూరి తమ మధురమైన గాత్రాలతో ప్రాణం పోశారు. హీరో-హీరోయిన్ల మధ్య ప్రేమ, అనుబంధం, భావోద్వేగాలను హృద్యంగా ప్రతిబింబించే ఈ గీతం సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. దినేష్ కుమార్ అందించిన కొరియోగ్రఫీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.
కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న వడ్డే నవీన్, ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ చిత్రంలో ఆయన నటనలో కొత్త కోణం కనిపించబోతుందనే సంకేతాలు ఇప్పటికే ప్రచార చిత్రాల ద్వారా కనిపిస్తున్నాయి. దర్శకుడు కమల్ తేజ నార్లతో కలిసి కథ, స్క్రీన్‌ప్లే రూపకల్పనలో కూడా వడ్డే నవీన్ భాగస్వామ్యం కావడం విశేషం.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో క్లాసిక్, బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా సినీ నేపథ్యంతో వచ్చిన వడ్డే నవీన్, ఇప్పుడు నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో వడ్డే క్రియేషన్స్ సంస్థను ప్రారంభించారు. ఆ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ కావడంతో ఈ సినిమాపై పరిశ్రమ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. వినోదంతో పాటు భావోద్వేగాలకు చోటిచ్చే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
| నటీనటులు | |
|---|---|
| వడ్డే నవీన్, రాశీ సింగ్, రఘు బాబు, సాయిశ్రీనివాస్, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, దేవిప్రసాద్, సూర్యకుమార్ భగవత్ దాస్, శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, జ్వాలా కోటి, దేవి మహేష్, ఊహా రెడ్డి, రేఖా నిరోష్, గాయత్రి చాగంటి, సాత్విక్ రాజు, అంజలి ప్రియ తదితరులు. | |
| సాంకేతిక వర్గం | |
| బ్యానర్ | వడ్డే క్రియేషన్స్ |
| సమర్పణ | వడ్డే జిష్ణు |
| నిర్మాత | వడ్డే నవీన్ |
| దర్శకుడు | కమల్ తేజ నార్ల |
| కథ, స్క్రీన్‌ప్లే | కమల్ తేజ నార్ల, వడ్డే నవీన్ |
| సంగీతం | కళ్యాణ్ నాయక్ |
| సినిమాటోగ్రఫీ | కార్తీక్ సుజాత సాయి కుమార్ |
| ఎడిటర్ | విజయ్ ముక్తావరపు |
| పి.ఆర్.ఒ | వంశీ కాకా |

Comments (0)