మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి…

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి మెలోడీయస్ ‘ప్రియసఖి’ విడుదల
యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న EPIC – First Semester నుంచి విడుదలైన రెండో గీతం ‘ప్రియసఖి’ ఇప్పటికే సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది. ప్రేమలో చెప్పలేని భావాలు, మౌనంగా మనసులో దాచుకునే అనురాగాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించిన ఈ పాట, వినగానే మనసుకు హాయిని పంచే మెలోడీగా నిలిచింది. గేయ రచయిత సురేష్ బనిశెట్టి అందించిన సరళమైన కానీ భావోద్వేగభరితమైన సాహిత్యం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, గాయకుడు K. S. Harisankar తన మృదువైన గాత్రంతో ప్రతి పదానికి ప్రాణం పోశారు. ఇక సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మరోసారి తన సంగీత మాయాజాలాన్ని చూపిస్తూ ప్రశాంతత, ప్రేమ, భావోద్వేగాలను కలిపిన అందమైన ట్యూన్‌ను అందించారు.
లండన్ అందాల నడుమ చిత్రీకరించిన ఈ గీతం విజువల్‌గా కూడా ఎంతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కనిపించిన సహజమైన కెమిస్ట్రీ ప్రేక్షకులను మరోసారి ‘బేబీ’ రోజుల్ని గుర్తు చేసేలా చేసింది. ప్రేమలోని అమాయకత్వం, చెప్పలేని అనుబంధాన్ని తెరపై ఎంతో సహజంగా చూపించిన తీరు ఈ పాటకు మరింత బలం ఇచ్చింది. ‘90s’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ప్రియసఖి’ పాటను చూస్తే.. ఈ సినిమా కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, భావోద్వేగాలతో నిండిన అందమైన యూత్ ఎమోషనల్ జర్నీగా నిలవబోతుందనే అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
| తారాగణం | ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య |
| రచన, దర్శకత్వం | ఆదిత్య హాసన్ |
| సంగీతం | హేషమ్ అబ్దుల్ వహాబ్ |
| ఛాయాగ్రహణం | అజీమ్ మహమ్మద్ |
| కూర్పు | నవీన్ నూలి |
| ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | ఫణి కె వర్మ |
| సహ నిర్మాతలు | వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ |
| నిర్మాతలు | సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య |
| నిర్మాణ సంస్థలు | సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ |
| సమర్పణ | శ్రీకర స్టూడియోస్ |
| పీఆర్ఓ | లక్ష్మివేణుగోపాల్ |

