Skip to content

మెగాస్టార్ – బాబీ కొల్లి కాంబినేషన్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్..రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందుతున్న #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ హిట్ కాంబో మరోసారి చేతులు కలపడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పలు భాషల్లో విజయాలు సాధించిన ఈ సంస్థకు ఇది తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం, నేడు హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. తొలి షెడ్యూల్‌లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలక టాకీ పార్ట్ చిత్రీకరిస్తుండగా, ఈ సన్నివేశాలు కథలో అత్యంత ముఖ్యమైన మలుపుగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా విడుదలైన BTS వీడియోలో చిత్రబృందం ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది. చిరంజీవి తనదైన స్టైల్‌లో “లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్” అంటూ ఆకట్టుకోగా, టైటిల్ విషయంపై బాబీని సరదాగా ఆటపట్టిస్తూ “సరైన సమయంలో నేనే టైటిల్ లీక్ చేస్తానేమో” అని చెప్పడం వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. బాబీ కొల్లి భారీ స్థాయిలో సిద్ధం చేసిన ఈ కథలో చిరంజీవి తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనుండగా, అందుకోసం ఆయన ప్రత్యేక ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా అయ్యారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీతం ఎస్. థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ విజయ్ కార్తిక్ కన్నన్, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా, ఎడిటింగ్ ఆంటోని ఎల్. రూబెన్ నిర్వహిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, భాను–నందు ద్వయం సంభాషణలు రాస్తున్నారు. కథానాయికతో పాటు ఇతర తారాగణం వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

తారాగణం
హీరో మెగాస్టార్ చిరంజీవి
హీరోయిన్ అనశ్వర రాజన్
సాంకేతిక సిబ్బంది
రచన, దర్శకత్వం బాబీ కొల్లి
నిర్మాత వెంకట్ కె నారాయణ
బ్యానర్ కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం థమన్ ఎస్
స్క్రీన్ ప్లే రైటర్స్ కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఆడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్ హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
DOP విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్ ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్ యుగంధర్ టి
డైలాగ్స్ భాను-నందు
ఛీప్ కో-డైరెక్టర్లు బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్ వి క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరణ్య పోట్ల
PRO వంశీ-శేఖర్
మార్కెటింగ్ హాష్‌ట్యాగ్ మీడియా

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top