మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో #ChiruBobby2 / #Chiru158 చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి…

‘స్వయంభూ’ విజువల్ గ్రాండియర్‌కు ఫినిషింగ్ టచ్‌లు
నిఖిల్ సిద్ధార్థ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కుతున్న ‘స్వయంభూ’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కేవలం కథా పరంగా మాత్రమే కాదు, సాంకేతికంగా కూడా ఇండియన్ సినిమాకు కొత్త స్థాయిని తీసుకురానుందనే సంకేతాలు తాజాగా విడుదలైన వీడియోతో స్పష్టమయ్యాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనుల కోసం వందలాది మంది నిపుణులు పని చేస్తుండటం, 2700కి పైగా వీఎఫ్ఎక్స్ షాట్లను అత్యంత నాణ్యతతో రూపొందించడం ఈ ప్రాజెక్ట్ విస్తృతిని తెలియజేస్తోంది. ఫాంటమ్ ఎఫ్ఎక్స్లో జరుగుతున్న పనులను స్వయంగా నిఖిల్, దర్శకుడు భారత్ కృష్ణమాచారి, సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ పర్యవేక్షించడం చిత్రబృందం క్వాలిటీపై ఎంత ఫోకస్ పెట్టిందో చూపిస్తోంది. భారీ యుద్ధ సన్నివేశాలు, ప్రాచీన రాజ్యాల సెటప్‌లు, గ్రాండియర్ విజువల్స్‌తో ‘స్వయంభూ’ నిజమైన పాన్ ఇండియా విజువల్ స్పెక్టకిల్‌గా నిలవనుందనే నమ్మకం కలుగుతోంది. ఇప్పటికే టీజర్, ‘రా రా ధీవరా’ పాటకు వచ్చిన స్పందన సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచగా, రవి బస్రూర్ సంగీతం, సెంథిల్ కుమార్ విజువల్స్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి.

| తారాగణం | |
|---|---|
| నటీనటులు | నిఖిల్, సంయుక్త, నభా నటేష్ |
| సాంకేతిక సిబ్బంది | |
| రచన, దర్శకత్వం | భరత్ కృష్ణమాచారి |
| నిర్మాతలు | భువన్, శ్రీకర్ |
| బ్యానర్ | పిక్సెల్ స్టూడియోస్ |
| సమర్పణ | ఠాగూర్ మధు |
| DOP | KK సెంథిల్ కుమార్ |
| సంగీతం | రవి బస్రూర్ |
| ఎడిటర్ | తమ్మిరాజు |
| డైలాగ్స్ | విజయ్ కామిశెట్టి |
| ప్రొడక్షన్ డిజైనర్లు | ఎం ప్రభాహరన్, రవీందర్ |
| యాక్షన్ | కింగ్ సోలమన్, స్టంట్ సిల్వా |
| సాహిత్యం | రామజోగయ్య శాస్త్రి |
| PRO | వంశీ-శేఖర్ |
| మార్కెటింగ్ | ఫస్ట్ షో |
