హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న భావోద్వేగ ప్రధాన చిత్రం ‘తీరం’ టైటిల్ సాంగ్‌ను ఘనంగా…

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేతుల మీదుగా 30 మందికి రూ.22 లక్షల CMRF చెక్కుల పంపిణీ
ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 30 మంది లబ్ధిదారులకు రూ.22 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందన్నారు. గత 23 నెలల్లో 1200 మందికి పైగా లబ్ధిదారులకు CMRF ద్వారా ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడం తన బాధ్యత అని పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు.
