‘రాజా ది రాజా’చాలా పాషన్ తో చేసిన సినిమా. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను: హీరో రుత్విక్
విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ లాంచ్ చేసి, రుత్విక్, అనిల్ బోయిడపు, వృందావన్ క్రియేషన్స్ ‘రాజా ది రాజా’ ఎంటర్టైనింగ్ టీజర్
మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి నేటి తరానికి కనెక్ట్ ఎలిమెంట్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది.
విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు , అనిల్ బోయిడపు విజన్ మొదటి ఫ్రేం నుంచే ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో వీకే నరేష్, రుత్విక్ తండ్రి పాత్రలో కనిపిస్తారు. తండ్రి–కొడుకుల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని టీజర్ హత్తుకునేలా చూపించింది. తన కొడుకు డాక్టర్ కావాలని తండ్రి ఆశపడుతుంటే, అతన్ని నిరాశపరచకుండా ఉండేందుకు అబద్ధం చెప్పే కుమారుడు మాత్రం ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంటాడు.
తన కలను నిజం చేసుకోవాలని తపనపడే యువకుడిగా రుత్విక్ అద్భుతంగా కనిపించాడు. ఇక విశాఖ ధీమన్ పోషించిన ఆద్య పాత్ర కథలోకి ప్రవేశించిన తర్వాత హీరో జీవితంలో జరిగే మార్పులు ఆసక్తిని పెంచుతున్నాయి. ఆ మార్పుల వెనుక ఉన్న అసలు కథను పెద్ద తెరపై చూపించబోతున్నారు మేకర్స్.
హీరో హీరోయిన్ల మధ్య కనిపించిన అందమైన కెమిస్ట్రీ, యూత్‌ఫుల్ కాన్సెప్ట్, ఉన్నత స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ బ్రిలియన్స్ టీజర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రుత్విక్, విశాఖ పాత్రలను చక్కగా పరిచయం చేస్తూనే కథపై బలమైన ఆసక్తిని కలిగించేలా టీజర్ రూపొందించారు.
హాస్యం, ప్రేమ, యాక్షన్, హీరో కలలు… ఇలా అన్ని భావోద్వేగాలను దర్శకుడు ఎంతో చక్కగా హ్యాండిల్ చేశారని టీజర్ ద్వారా తెలుస్తోంది. రవికిరణ్ బోయిడాపు సినిమాటోగ్రఫీ, మార్క్ కె రాబిన్ సంగీతం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ అద్భుతమైన టీజర్‌తో మేకర్స్ ఒకేసారి టాలెంటెడ్ యంగ్ హీరోను, మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసినట్లైంది.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, వివేక్ ఆత్రేయ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి పాల్గొన్నారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. రిత్విక్, నిహారిక ఫ్యామిలీ ఫ్రెండ్స్. రిత్విక్ జర్నీని నేను దగ్గరగా చూశాను. చాలా డెడికేషన్‌తో వర్క్ చేశాడు. నిహారిక ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా నిర్మించారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్”
డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఒక పాట చూశాను. చాలా బాగుంది. రిత్విక్‌లో చాలా మంచి ఈజ్ ఉంది. తనకి ఆల్ ది వెరీ బెస్ట్. ‘శంకరాభరణం’ నా ఫేవరెట్ ఫిలిం. మంజు భార్గవి గారిని ఈరోజు స్టేజ్‌పై కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ టీమ్ అందరికీ గుడ్ లక్
డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. టీజర్ చాలా బాగుంది. ఈ టీజర్ చూస్తుంటే నిహారికకి తన బ్రదర్‌పై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. తన సపోర్ట్ మొత్తం ఈ సినిమాకి పెట్టారు. టీమ్ అందరికీ గుడ్ లక్. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను
నిర్మాత మైత్రి రవి మాట్లాడుతూ.. టీజర్ చాలా రిచ్ గా వుంది. నిహారిక చాలా గ్రాండ్‌గా నిర్మించారు. రిత్విక్‌కు కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని కోరుకుంటున్నాను. టీమ్ అంతా కూడా చాలా చక్కగా పనిచేశారు. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాకు పెద్ద దర్శకులు వచ్చి సపోర్ట్ చేసినందుకు థాంక్యూ. సినిమా చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది
హీరో రుత్విక్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాగ్ అశ్విన్ గారికి, హను రాఘవపూడి గారికి, వివేక్ ఆత్రేయ గారికి, రవి గారికి ధన్యవాదాలు. ఈ వేడుకు వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ‘రాజా ది రాజా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఈ సినిమాను నిర్మించిన మా అక్కకి, మా డైరెక్టర్‌కి, టెక్నీషియన్స్‌కి, నటీనటులందరికీ థాంక్యూ. మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. నన్ను యాక్టర్‌గా గుర్తిస్తారని, ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. ‘రాజా ది రాజా’ జర్నీ చాలా మెమొరబుల్. నన్ను ఇంతగా నమ్మిన నా పేరెంట్స్‌కి థాంక్యూ. ప్రతి దశలో నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుంది. డైరెక్టర్ అనిల్ చాలా డెడికేషన్‌తో సినిమా చేశారు. మంజు భార్గవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. సాయి కుమార్ గారు, నరేష్ గారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. నన్ను సపోర్ట్ చేసిన నాగీ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు.
నిర్మాత నిహారిక దాసరి మాట్లాడుతూ.. రిత్విక్‌లో చాలా ప్రతిభ ఉంది. తన ప్యాషన్ కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. తప్పకుండా హీరోగా అందరినీ అలరిస్తాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలని కోరుకుంటున్నాను. మార్క్ చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ.
డైరెక్టర్ అనిల్ మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన మా నిర్మాత నిహారిక గారికి, హీరో రిత్విక్ గారికి చాలా థాంక్స్. నిహారిక గారు ఎక్కడా రాజీ పడకుండా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. రిత్విక్ గారికి సినిమా, యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్. ఈ సినిమా కోసం ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. తప్పకుండా తను ప్రేక్షకులు ఆదరణ అందుకుంటారు. విశాఖ ఆద్య పాత్రకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ.. మంచి క్వాలిటీ సినిమా ప్రేక్షకులకు అందించాలని లక్ష్యంతో మా నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. నిహారిక గారి ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి. రిత్విక్‌కి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను
నటి మంజు భార్గవి మాట్లాడుతూ.. నిహారికకి కంగ్రాచ్యులేషన్స్. తను ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అద్భుతమైన క్వాలిటీతో నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది.
హీరోయిన్ విశాఖ ధీమన్ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా స్పెషల్ ఫిలిం. సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. రిత్విక్ చాలా సపోర్ట్ చేశారు. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తను మల్టీ టాలెంటెడ్. తప్పకుండా ఈ సినిమాను మీరందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.

| తారాగణం & సిబ్బంది | |
|---|---|
| తారాగణం | రుత్విక్, విశాఖ ధీమాన్, సాయి కుమార్, డా. నరేష్ విజయ కృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓయి, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, బద్రం, మైమ్ మధు, ఆనంద్ |
| బ్యానర్ | వృందావన్ క్రియేషన్స్ |
| సమర్పణ | కె శ్రీలత రెడ్డి |
| నిర్మాత | కె. నిహారిక దాసరి |
| దర్శకత్వం | అనిల్ బోయిడపు |
| డీవోపీ | రవికిరణ్ బోయిడపు |
| సంగీతం | మార్క్ కె రాబిన్ |
| ఆర్ట్ డైరెక్టర్ | విజయ్ కుమార్ పసుపులేటి |
| ఫైట్ మాస్టర్ | అంజి మాస్టర్ |
| కొరియోగ్రాఫర్ | హరి కిరణ్ మాస్టర్ |
| PRO | వంశీ-శేఖర్ |
















Comments (0)