Skip to content
Movies

‘దూరదర్శని’ ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతుంది: దర్శకుడు కార్తికేయ కొమ్మి

May 12, 20269 second read

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శకుడు కార్తికేయ కొమ్మి చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలివి.

మీ నేపథ్యం ఏమిటి?

ఇంతకు ముందు నేను సాధ్యం, వసూల్‌ రాజా, లక్ష్మీబాంబ్‌ సినిమాలకు దర్శకత్వం చేశాను. నేను కొత్తవాళ్లతో చేసిన తొలి ప్రాజెక్ట్‌ ఇది. యదార్థ సంఘటనతో చాలా రియలిస్టిక్‌గా ఈ సినిమాను రూపొందించాను.

దూరదర్శని కథ ఏమిటి?

కథగా చెప్పుకుంటే పేరెంట్స్‌ చాయిస్‌, సొసైటీ చాయిస్‌, పిల్లల చాయిస్‌.. వీటి మధ్య ఉండే క్లాష్‌.. ఈ చిత్ర కథాంశం.

చిత్రలహరి టైమ్‌ పిరియడ్‌ మిస్‌ అయిన వారికి. ఆ టైమ్‌లో చిత్రలహరి అనుభూతిని పొందిన వారికి ఈ సినిమా పూర్తి సంతృప్తినిస్తుంది. చిత్రలహరి గురించి అందరూ ఎలా వెయిట్‌ చేసే వారు.. అక్కడ జరిగే ప్రేమకథ. చిత్రలహరి అనేది గ్యాదరింగ్‌ పాయింట్‌లా ఎలా ఉండేది. అందరూ ఇది కేవలం లవ్‌స్టోరీ అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ చిత్రలహరి పోగ్రామ్‌ కోసం వేచి చూసిన రోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ల గోల్డెన్‌ డేస్‌లోకి తీసుకవెళుతుంది.

ఇటీవల తిమ్మరాజు పల్లి టీవీకి అనే సినిమా వచ్చింది ఆ సినిమాతో ఏమైనా పోలీకలు ఉంటాయా?

కథ విషయంలో ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదు. ఇది కంప్లీట్‌ ఎమోషన్‌ సినిమా. ఫాదర్‌, సన్‌కు మధ్య ఉన్న ఎమోషన్‌.. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం మీ హృదయాలకు హత్తుకుంటుంది.

అరుణాచలంలో బిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తి జీవిత కథ ఈ సినిమా అంటున్నారు?

ఆంధ్రా లో జరిగిన ఒక రియాల్‌ ఇన్‌సిడెంట్‌ ఇది. ఇప్పుడు ఆ వ్యక్తి అతను అరుణాచలంలో ఉన్నాడు. అతని జీవితంలో జరిగిన కథను స్పూర్తిగా తీసుకుని ఈ కథను తయారుచేశాం. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన లైఫ్‌ స్టోరియే సినిమా ఇది. ఆయన సొంత కొడుకు వల్ల ఆ పెద్దాయన బిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ కథ. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న కథ ఇది.

సినిమా రియల్‌స్టిక్‌గా ఉంటుందా? లేదా సినిమాటిక్‌ లిబర్టి తీసుకున్నారా?

సినిమాటిక్‌గా చాలా తక్కువగా ఉంటుంది. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథ. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది’ అన్నారు.

సాధారణంగా ఇలాంటి లవ్‌స్టోరీస్‌కు పతాక సన్నివేశాలు హైలైట్‌ అవుతుంటాయి? ఈసినిమాలో పతాక సన్నివేశాలు ఎలా ఉంటాయి?

ఈ సినిమా పతాక సన్నివేశాలు అందర్ని ఆలోచింపజేస్తాయి. సినిమా చూసిన వచ్చిన తరువాత ఆ ఫీల్‌ మిమ్ములను వదిలివెళ్లదు’ అన్నారు.అందరూ ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతితో థియేటర్‌ నుంచి బయటికొస్తారు.

హీరో, హీరోయిన్‌ చనిపోతారని చెప్పారు. ఎందుకని? ఇలా చెబితే సినిమాపై ఆసక్తి తగ్గుతుంది కదా?

స్క్రీన్‌ప్లేలో ఉండే మ్యాజిక్‌ ఇది. ఫైనల్‌గా ఎలా హ్యపీ ఎండింగ్‌ అనేది ఉంటుంది. ఓవరాల్‌గా తల్లిదండ్రుల ఎమోషన్‌ బాగా కనెక్ట్‌ అవుతుంది.

హీరో, హీరోయిన్‌ పర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉంటుంది?

కొత్తవాళ్లతో చేసే అవకాశం రావడం థ్లిల్లింగ్‌గా అనిపించింది. ఈ మూవీకి హీరో, హీరోయిన్‌ పర్‌పార్మెన్స్‌ హైలైట్‌గా ఉంటుంది. వాళ్ల నటనతో సినిమాను మరో మెట్టు ఎక్కించారు.

మీ తదుపరి చిత్రం?

ఆగస్టులో ఓ పెద్ద ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించబోతున్నాను

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top