డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘సందిగ్ధం’ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, నవీన్ రాజ్ సంకరపు ప్రధాన పాత్రల్లో నటించారు. తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇక ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా టీం కంప్లీట్ చేసింది. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టిన చిత్రయూనిట్ త్వరలోనే సెన్సార్ వద్దకు వెళ్లనుంది.
ప్రస్తుతం ‘సందిగ్ధం’ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. మే 29న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు టీం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇక మున్ముందు ప్రమోషనల్ కార్యక్రమాలతో ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయనున్నారు.
ఈ మూవీకి గౌతమ్ రవి రామ్ సంగీతాన్ని అందించారు. నందన్ కృష్ణ కెమెరామెన్‌గా, విశ్వన్ రాజ్. డిఎస్ ఎడిటర్‌గా పని చేశారు.
జీవా కొచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగిరెడ్డి, శ్రీదేవీ, దుర్గ, లక్ష్మీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
| నటీనటులు | |
|---|---|
| నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, జీవా కొచెర్ల, నవీన్ రాజ్ సంకరపు, చిట్టిబాబు, ఆనంద్ భారతి, రైజింగ్ రాజు, అప్పారావు, నాగిరెడ్డి, శ్రీదేవి, దుర్గ, లక్ష్మీ తదితరులు. | |
| సాంకేతిక బృందం | |
| బ్యానర్ | తీర్థ క్రియేషన్స్ |
| నిర్మాత | సంధ్య తిరువీధుల |
| దర్శకుడు | పార్థసారధి కొమ్మోజు |
| సంగీతం | గౌతమ్ రవి రామ్ |
| కెమెరామెన్ | నందన్ కృష్ణ |
| ఎడిటర్ | విశ్వన్ రాజ్ డి.ఎస్ |
| పీఆర్వో | సాయి సతీష |
















Comments (0)