సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ భారీ అంచనాలని సృష్టించాయి.
ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీ.
2026 మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
| వీరభద్రుడు – చిత్ర వివరాలు | |
|---|---|
| తారాగణం | సూర్య, త్రిష, ఇంద్రన్స్, నట్టి, స్వసిక, అనఘ మాయ రవి, శివాడ, సుప్రీత్ రెడ్డి |
| రచన & దర్శకత్వం | RJ బాలాజీ |
| సినిమాటోగ్రఫీ | జికె విష్ణు |
| సంగీతం | సాయి అభ్యంకర్ |
| యాక్షన్ | అన్బరివ్ – విక్రమ్ మోర్ |
| ఎడిటర్ | ఆర్. కళైవానన్ |
| ప్రొడక్షన్ డిజైన్ | అరుణ్ వెంజారామూడు |
| నిర్మాతలు | ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు |
| తెలుగు రిలీజ్ | అన్నపూర్ణ స్టూడియోస్ |
| పీఆర్వో | వంశీ-శేఖర్ |

















Comments (0)