Skip to content
Movie Schedules

గోదారి గట్టుపైన సూపర్ క్యూట్ ఫిల్మ్. మంచి ఫ్యామిలీ వైబ్ ఉంటుంది. : హీరో సుమంత్ ప్రభాస్

May 5, 20268 second read

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ప్రమోషన్స్ చాలా ‘కూల్’ గా చేస్తున్నారు.. రిలీజ్ కోసం మీరు ఎంత కూల్ గా ఉన్నారు?
-నేను అయితే కూల్‌గా లేను (నవ్వుతూ). మూడేళ్ల తర్వాత నా నుంచి సినిమా వస్తుంది. తొలి సినిమా ‘మేము ఫేమస్’కి కూడా ఇంతే అగ్రెసివ్‌గా ప్రమోషన్స్ చేశాం. మూడేళ్ల తర్వాత సినిమా వస్తుండటంతో ఇది కూడా నాకు తొలి సినిమాలానే ఉంది. ఆడియన్స్ దగ్గరకు రీచ్ కావాలంటే ప్రమోషన్స్ వినూత్నంగా ఉండాలి.

-‘మేము ఫేమస్’ యూత్ తెలంగాణ పల్లె కథ. ‘గోదారి గట్టుపైన’ గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సూపర్ క్యూట్ ఫిల్మ్. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. జగపతి బాబు గారిది మెయిన్ క్యారెక్టర్. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి ఇంటెన్స్, అగ్రెసివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో మాత్రం ‘శుభలగ్నం’, ‘ఫ్యామిలీ సర్కస్’ సినిమాల్లా అందరూ రిలేట్ అయ్యే సూపర్ క్యూట్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. మా మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి.

-గోదావరి యాసలో నటించడం మరింత ఎక్సైటింగ్‌గా ఉంది. సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఇందులో చూపించిన లవ్, ఫాదర్-డాటర్ ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.

యాస విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
నేను పుట్టి పెరిగింది తెలంగాణలో. గోదారి యాస కోసం దాదాపు నాలుగు నెలలు రిహార్సల్స్ చేశాను. అక్కడ పుట్టి పెరిగిన వారు విన్నప్పుడు ఖచ్చితంగా మనలాగే మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ రావాలని ప్రయత్నించాను.

ఈ కథ అంగీకరించడానికి కారణం?
‘మేము ఫేమస్’ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ మంచి కథ కోసం వెతుకుతుంటే కొంత ఒత్తిడి పెరిగేది. అప్పుడు కథని, ఎమోషన్స్ కొత్తగా చెప్పే ఫిల్మ్ మేకర్ కోసం వెతుకుతున్నప్పుడు సుభాష్ గారు కలిశారు. ఆయన ఇప్పటికే వంద షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఆయన షార్ట్ ఫిలిమ్స్ సినిమా స్టయిల్‌లోనే తీసేవారు. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. గోదారి నేపధ్య కథ అంటే నాకు ఛాలెంజ్‌గా అనిపించింది. నటనకు మంచి స్కోప్ దొరికింది.

ఇందులో మీ క్యారెక్టర్ గురించి?
-ఆటో డ్రైవర్ అంటే సాధారణంగా మాస్ క్యారెక్టర్‌గా చూపిస్తారు. కానీ ఆటో డ్రైవర్లు చాలా ఇన్నోసెంట్, క్యూట్‌గా కూడా ఉంటారు. ఇందులో నా క్యారెక్టర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విలువ ఇచ్చే పాత్ర. చాలా మంచి క్యారెక్టర్. ఇందులో ఆటో రేస్ కూడా ఉంటుంది. దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను. ఫన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా రాసుకున్నారు.

మీరు కూడా డైరెక్టర్ కదా.. సలహాలు ఇచ్చేవారా?
లేదు. సుభాష్ గారు చాలా కష్టపడి ఈ కథను పర్ఫెక్ట్‌గా రాశారు. ఆయన స్టయిల్‌లోనే ప్రెజెంట్ చేయాలని అనుకున్నారు. కథ వినగానే ఆయనకు పూర్తిగా సరెండర్ అయ్యాను. ప్రమోషన్స్ మాత్రం నాకు వదిలేయండి అన్నాను (నవ్వుతూ).

దేవి ప్రసాద్ గారు గురించి?
దేవి ప్రసాద్ గారు నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. చాలా మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు.

మ్యూజిక్ గురించి?
-నాగవంశీ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం కూడా అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది.

మీ పేరు వెనుక కథ?
-నా పేరు సుమంత్. అప్పట్లో ఫేస్‌బుక్‌లో ఫేవరేట్ హీరో పేరును యాడ్ చేసే ట్రెండ్ ఉండేది. అలా ‘సుమంత్ ప్రభాస్’ అని పెట్టుకున్నాను. అదే కంటిన్యూ అయింది (నవ్వుతూ).

ప్రమోషన్స్ వీడియోస్ చాలా క్రియేటివ్ గా వున్నాయి.. ఐడియాలు ఎవరివి?
నావే. నేనే రాసి డైరెక్ట్ చేశాను. ఆడియన్స్ కి రీచ్ కావాలంటే కొత్తగా ప్రచారం చేయాలి. సినిమా సమ్మర్‌లో వస్తుంది కాబట్టి ‘కూల్’ కాన్సెప్ట్‌తో యాడ్స్ చేశాం. ఇవన్నీ మిలియన్ వ్యూస్‌లో వెళ్తున్నాయి. యాడ్స్‌లో ఉన్న కూల్‌నెస్ సినిమా చూసినప్పుడు కూడా ఫీల్ అవుతారు.

నిర్మాత అభినవ్ గురించి?
అభినవ్ గారు చాలా మంచి ప్రొడ్యూసర్. డైరెక్టర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా మంచి క్వాలిటీతో సినిమా తీశారు. సినిమా మొత్తం రియల్ లోకేషన్స్‌లో తీశాం. జగపతి బాబు గారు లోకేషన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండి కంఫర్ట్ ఇచ్చారు.

సినిమాలో జగపతి బాబు గారు, నిధి పాత్రలు చాలా బలంగా ఉంటాయి. వారి ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా ఉంటాయి. నిధి తెలుగు చాలా బాగా నేర్చుకుని అద్భుతంగా చేసింది. జగపతిబాబు గారు–లైలా గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మంచి ఫ్యామిలీ వైబ్ వుంటుంది,

మీరు విన్న కథల్లో సూపర్ హిట్ అయినది?
‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ సాయిలు అన్న చెప్పారు. నాకు చాలా నచ్చింది. కానీ అప్పటికే ‘మేము ఫేమస్’ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో చేశాను. మళ్లీ అదే చేస్తే రిపీట్ ఫీలింగ్ వస్తుంది. ఇదే విషయం సాయిలు అన్నకి చెప్పాను. ఆ కథ అఖిల్ చేశాడు. అతనికి హెల్ప్ అయ్యింది. ఇండస్ట్రీకి కొత్త ట్యాలెంట్ వచ్చింది.

మహేష్ బాబు గారు మీ తొలి సినిమాకి ట్వీట్ చేశారు.. ఇప్పుడు ఆయన పాటని టైటిల్ గా పెట్టారు.. ఎలా నిపిస్తోంది?
ఇది యాదృచ్చికం. నా ఫస్ట్ సినిమాను మహేష్ బాబు గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మంచి స్క్రిప్ట్ వుంటే వారి బ్యానర్ లోనే సినిమా చేయమని చెప్పడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఆయన ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తారు.

నెక్స్ట్ సినిమాలు?
ఒక సినిమా పూర్తయింది. త్వరలో వివరాలు తెలియజేస్తారు. ఇకపై గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాను.

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top