మలయాళ ఫిల్మ్ మేకర్స్ తెలుగు స్టార్లతో కలిసి పనిచేస్తున్నారు. మమ్ముట్టి నటించిన ‘స్ట్రీట్ లైట్స్’కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్, ‘చౌర్య పాఠం’లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ సినిమా చేస్తున్నారు. వి. చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2 గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రివిల్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవీంద్ర విజయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ లో రవీంద్ర విజయ్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇంటెన్స్ వైబ్‌తో ఉన్న ఈ ఫస్ట్ లుక్ ఆయన పాత్రలో వున్న సస్పెన్స్, థ్రిల్ ఎలిమెంట్స్ ప్రజెంట్ చేస్తోంది.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి పనిచేసిన మోనికా-రామకృష్ణ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని గోకుల్ హర్షన్ అందించారు. స్టేట్ అవార్డు గ్రహీత అయిన మనోజ్ ఎడిటింగ్ చేశారు. గతంలో RDX , దుల్కర్ సల్మాన్ నటించిన ఐయామ్ గేమ్ చిత్రాలకు పనిచేసిన సజీర్, లూనా కథను అందించారు.
ఎమోషనల్, టెక్నికల్‌గా ఈ చిత్రం గొప్ప సైకాలజికల్ థ్రిల్లర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతుంది.
తారాగణం: ఇంద్ర రామ్, రవీంద్ర విజయ్, తబా రీమా, జ్యోతి బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్, కల్ప లత, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్, నాగి జబర్దస్త్, డాక్టర్ భద్రమ్, రఘుబాబు, తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
డైరెక్టర్, DOP: షామ్‌దత్ ISC
కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: సజీర్ బాబా & లూనా జబిన్
నిర్మాత: వి చూడామణి
బ్యానర్: వి డ్రీమ్ ఫిల్మ్స్
సంగీతం: గోకుల్ హర్షన్
ప్రొడక్షన్ డిజైన్: మోనికా రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్
















Comments (0)