Skip to content
Movies

నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన జయకృష్ణ ఘట్టమనేని, రాషా తడాని ‘శ్రీనివాస మంగాపురం’ మ్యాజికల్ మెలోడీ ‘అలెల్లె అలెల్లె’

April 30, 202611 second read

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్ట్‌ తో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. అశ్విని దత్ సమర్పణలో, చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘అలెల్లె అలెల్లె’ను లాంచ్ చేశారు.

కొన్ని పాటలు కేవలం బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తాయి… కొన్ని పాటలు కథ నుంచి వస్తాయి. ‘అలెల్లె అలెల్లె’ అలాంటి ప్రత్యేకమైన పాట. జివి ప్రకాష్ కుమార్ అద్భుతంగా కంపోజ్ చేసిన ఈ సాంగ్ వినగానే ఆకట్టుకుంటుంది. మొదట మెలోడియస్‌గా మొదలై, తర్వాత ఉత్సాహభరితమైన ట్రాక్‌గా అలరిస్తుంది. ప్రతి నోట్ మనసుని తాకుతోంది.

శ్రీమణి రాసిన సాహిత్యం ప్రేమలో ఉండే ఆ మధురమైన ఎమోషన్ ని అద్భుతంగా వ్యక్తపరుస్తుంది. ప్రతి ఫీలింగ్ కొత్తగా, ప్రతి క్షణం మ్యాజిక్‌లా అనిపించే అనుభూతిని అందిస్తుంది. జివి ప్రకాష్ కుమార్, హరి ప్రియా వోకల్స్ ఈ పాటకు మరింత బ్యూటీ జోడించాయి. వారి వోకల్స్ రెండు మనసులు కలిసిన ఫీలింగ్ ని క్రియేట్ చేశాయి.

జయకృష్ణ, రషా జోడి ఈ పాటకు ప్రాణం పోసారు. వారి కెమిస్ట్రీ ఎంతో సహజంగా వుంది. అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ ఈ పాటను ఒక మధురమైన జ్ఞాపకంలా మార్చాయి.

‘శ్రీనివాస మంగాపురం’ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, సినిమాటోగ్రఫీ జయకృష్ణ ISC నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్ మాధవ్ కుమార్ గుల్లపాటి. ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్. యాక్షన్ సన్నివేశాలను రియల్ సతీష్ రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి.కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్
PRO: వంశీ-శేఖర్

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top