మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి'. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్…

విశ్వక్ సేన్ – తరుణ్ భాస్కర్ కల్ట్ కాంబో రిటర్న్స్.. ‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్ రిలీజ్
యూత్ లో చెరగని ముద్ర వేసుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఇప్పుడు సీక్వెల్ ‘ENE Repeat’తో సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆ మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయడానికి రీయూనియన్ అవుతుండగా, శ్రీనాథ్ మాగంటి ఈ టీంకు కొత్త ఉత్సాహాన్ని జోడిస్తున్నారు. తరుణ్ భాస్కర్ మరోసారి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్త నవంబర్ 19ని విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. చిత్రం (మొదటి భాగం) విడుదలై ఎనిమిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆనాటి ‘కన్యా రాశి’ గ్యాంగ్ జ్ఞాపకాలను గుర్తు చేసేలా, అందరినీ ఆకట్టుకునే ఫ్రెండ్షిప్ యాంథమ్ నేపథ్యంతో ఒక ‘ఫీల్-గుడ్’ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ఇటీవల రీ-రిలీజ్‌లోనూ అద్భుతమైన స్పందన దక్కించుకోవడంతో, ఇప్పుడు సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
పార్ట్ వన్ లోని ప్రత్యేకతను కొనసాగించేలా ఈ సీక్వెల్‌కు ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ చేస్తుండగా, రాజేష్ పెంటకోట, సాలీ వైట్ ప్రొడక్షన్ డిజైన్‌ను రూపొందిస్తున్నారు.
విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే చిత్ర ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
| నటీనటులు | |
|---|---|
| ప్రధాన తారాగణం | విశ్వక్ సేన్, శ్రీనాథ్ మగంటి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను |
| సాంకేతిక బృందం | |
| రచన & దర్శకత్వం | తరుణ్ భాస్కర్ |
| నిర్మాతలు | సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి |
| నిర్మాణ సంస్థలు | ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా |
| సంగీతం | వివేక్ సాగర్ |
| DOP | AJ ఆరోన్ |
| సహ-దర్శకుడు | ఉపేంద్ర వర్మ |
| ఎడిటర్ | రవితేజ గిరిజాల |
| ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | సౌమిత్రి N |
| లైన్ ప్రొడ్యూసర్ | శ్రీను ఈర్ల |
| మార్కెటింగ్ & మోషన్ పోస్టర్ | Walls & Trends |
| పీఆర్వో | వంశీ-శేఖర్ |
