యంగ్ హీరో నార్నే నితిన్ తన గత మూడు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా…

‘ది ప్యారడైజ్’ నుంచి విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జుయల్ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల
నేచురల్ స్టార్ నాని పాన్ వరల్డ్ స్పెక్టాకిల్ ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన ప్రతి అప్డేట్తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన అద్భుతమైన విజన్‌తో ది ప్యారడైజ్ ను ఒక్కో అడుగు విస్తరిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. టైటిల్ గ్లింప్స్, కీలక పాత్రల పరిచయాల తర్వాత తాజాగా మరో ప్రధాన పాత్రను మేకర్స్ పరిచయం చేశారు.
ఈ చిత్రంలో విక్రమ్ మాలిక్ పాత్రలో నటిస్తున్న రాఘవ్ జుయాల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పాత్ర కోసం రాఘవ్ పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రా, డేంజరస్, భయానకమైన వ్యక్తిత్వంతో ఉన్న పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కర్లీ హెయిర్, ఆభరణాలు, రగ్గడ్ లుక్, అధికారం ప్రతిబింబించే హావభావాలతో విక్రమ్ మాలిక్ పాత్రను ఎంతో పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేశారు.
ఈ పాత్ర పరిచయాన్ని తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ మరింత ఎలివేట్ చేసింది. తన తెగకు గర్వకారణంగా, స్నేహితులకు ప్రాణస్నేహితుడిగా, శత్రువులకు భయంకరమైన శక్తిగా విక్రమ్ మాలిక్‌ను పరిచయం చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఈ పాత్రను పవర్ ఫుల్ గా చూపించారు.
గ్లింప్స్ చివర్లో నాని విక్రమ్ మాలిక్‌ను ‘జడల్ జమానా’ ప్రపంచంలోకి ఆహ్వానించే సన్నివేశం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణలు ఎలా ఉండబోతాయనే ఆసక్తిని పెంచుతోంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి అంశాన్ని అద్భుతంగా మలుస్తుండగా, నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ తన ఎనర్జిటిక్ స్కోర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నారు.
ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. చాయ్ సాయి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ను అందిస్తున్నారు.
‘ది ప్యారడైజ్’ 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది
| తారాగణం | |
|---|---|
| నటీనటులు | నాని, మోహన్ బాబు, కయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు |
| సాంకేతిక సిబ్బంది | |
| రచన, దర్శకత్వం | శ్రీకాంత్ ఓదెల |
| నిర్మాత | సుధాకర్ చెరుకూరి |
| బ్యానర్ | SLV సినిమాస్ |
| DOP | Ch సాయి |
| సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
| ఎడిటింగ్ | నవీన్ నూలి |
| ప్రొడక్షన్ డిజైనర్ | అవినాష్ కొల్లా |
| PRO | వంశీ-శేఖర్ |
| మార్కెటింగ్ | ఫస్ట్ షో |
