హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు…

‘సమ్మర్ హాలిడేస్’లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ ఫస్ట్ లుక్ రిలీజ్!
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ చిత్రం నుంచి సహజ నటి జయసుధ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్ చేశారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాలో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో జయసుధ ఆకట్టుకోనున్నారు. ప్రేమానురాగాలు పంచే అమ్మమ్మ సుశీలమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుకి హత్తుకోనుంది.
| నటీనటులు & సాంకేతిక బృందం | |
|---|---|
| నటీనటులు | రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు |
| డీవోపీ | సాయి ప్రకాశ్ |
| మ్యూజిక్ డైరెక్టర్ | సింజిత్ యెర్రమల్లి |
| బ్యానర్ | ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ |
| పీఆర్ఓ | సురేష్ (ఎస్ కె మీడియా) |
| ప్రొడ్యూసర్ | ధీరజ్ మొగిలినేని |
| స్టోరీ, డైరెక్టర్ | శ్రీకర్ |
