Skip to content

శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఒరియా పిల్లా’.. జూన్ 20న రిలీజ్

కింగ్‌ ఆఫ్ ఎంటర్టైన్‌మెంట్‌ శ్రీ విష్ణు తన వెర్సటైల్‌ పెర్ఫార్మెన్స్‌, యూనిక్ కథలతో అలరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్‌ వుండేలా చూసుకునే శ్రీవిష్ణు తన లేటెస్ట్ ఫన్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్‌ ప్రెజెంట్‌ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఒరియా పిల్లా జూన్ 20న రిలీజ్ చేయనున్నారు.

సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో శ్రీవిష్ణు, మహిమా మధ్య కనిపించిన అందమైన కెమిస్ట్రీ, లవ్ వైబ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి సాయి శ్రీరామ్‌ డీవోపీ, విజయ్‌ బుల్గానిన్‌ మ్యూజిక్, చోటా కె ప్రసాద్‌ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

కామ్రేడ్ కళ్యాణ్ – నటీనటులు & సాంకేతిక సిబ్బంది
తారాగణం శ్రీ విష్ణు
మహిమా నంబియార్
రాధిక శరత్‌కుమార్
షైన్ టామ్ చాకో
ఉపేంద్ర లిమాయే
దర్శకత్వం జానకిరామ్ మారెళ్ల
సమర్పణ కోన వెంకట్
నిర్మాతలు వెంకట కృష్ణ కర్నాటి & సీతా కర్నాటి
సంగీతం విజయ్ బుల్గానిన్
DOP సాయి శ్రీరామ్
ఎడిటర్ ఛోటా కె ప్రసాద్
PRO వంశీ-శేఖర్
Back To Top