మారుతి "భద్రం బి కేర్ ఫుల్" ఫేమ్ రాజ్ దాసిరెడ్డి... ప్రపంచప్రఖ్యాత ఫ్యాషన్ హౌస్ "లూయిస్ వ్యూట్టన్'లో సందడి చేశారు…

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’.. లాంచ్ చేసిన హీరోయిన్ రాశి సింగ్
హైదరాబాద్: భారతదేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ (Sign Laban) హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా అడుగుపెట్టింది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఒకేరోజు మూడు అవుట్‌లెట్లను ప్రారంభిస్తూ సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి హీరోయిన్ రాశి సింగ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి అవుట్‌లెట్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాశి సింగ్ మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. కొత్త రుచులను ఆస్వాదించేందుకు హైదరాబాద్ ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. ఇక్కడ అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేకమైన డెజర్ట్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయని నమ్ముతున్నాను. ‘సైన్ లబాన్’ టీమ్‌కు శుభాకాంక్షలు. ఈ బ్రాండ్ హైదరాబాద్‌లో గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
బ్రాండ్ ఫౌండర్స్ రిసియాస్, హాశిమ్, రిషద్ మాట్లాడుతూ, “రెండేళ్ల క్రితం కేరళలో ‘సైన్ లబాన్’ను ప్రారంభించాం. నాణ్యమైన రుచి, వినూత్నమైన డెజర్ట్స్‌తో వినియోగదారుల ఆదరణను పొందుతూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 64 అవుట్‌లెట్లకు విస్తరించాం. ఇప్పుడు హైదరాబాద్‌లో మా సేవలను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడి ప్రజలు మా ప్రత్యేకమైన ఈజిప్షియన్ డెజర్ట్స్‌ను తప్పకుండా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాం” అని తెలిపారు.
హైదరాబాద్ సిటీ పార్ట్‌నర్స్ గంగా విరాజ్, గంగా ధీరజ్ మాట్లాడుతూ, “భారతదేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ను హైదరాబాద్‌కు తీసుకురావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఒకేసారి మూడు అవుట్‌లెట్లను ప్రారంభించడం ద్వారా నగరవాసులకు అంతర్జాతీయ స్థాయి డెజర్ట్ అనుభూతిని అందిస్తున్నాం. భవిష్యత్తులో నగరంలోని మరిన్ని ప్రాంతాలకు కూడా ‘సైన్ లబాన్’ను విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం” అని వెల్లడించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగర ప్రముఖులు, ఫుడ్ బ్లాగర్లు, డెజర్ట్ ప్రియులు, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నోరూరించే విభిన్నమైన ఈజిప్షియన్ స్వీట్లు, ప్రత్యేకమైన డెజర్ట్స్, రుచికరమైన హై-టీతో అర్ష్‌లింక్ స్ట్రాటజిక్స్ టీమ్ ఘన స్వాగతం పలికింది. అతిథులు వివిధ రకాల డెజర్ట్స్‌ను ఆస్వాదిస్తూ వాటి ప్రత్యేక రుచిని ప్రశంసించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, “ఈజిప్ట్‌కు చెందిన సాంప్రదాయ, ప్రీమియం డెజర్ట్ రుచులను హైదరాబాద్ ప్రజలకు పరిచయం చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు నగరవాసులు రుచి చూడని ఎన్నో ప్రత్యేకమైన డెజర్ట్స్‌ను ‘సైన్ లబాన్’ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతర్జాతీయ స్థాయి డెజర్ట్స్‌ను ఆస్వాదించే ఉత్తమ గమ్యస్థానంగా ‘సైన్ లబాన్’ నిలుస్తుంది” అని తెలిపారు


