Skip to content

ప్రీమియర్స్‌కు అద్భుత స్పందన.. ‘న్యూటన్స్ థర్డ్ లా’పై సుమంత్ పూర్తి నమ్మకం!

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ మొత్తానికి థ్యాంక్స్. రాజేష్ ‘అనగనగా’ సినిమాకు ముందే ఈ కథను నాకు చెప్పారు. మంచి నిర్మాత కోసం ఎదురుచూశాం. ‘అనగనగా’ ఈటీవీ విన్‌లో పెద్ద హిట్ అయిన తర్వాత వాళ్లే ముందుకు వచ్చి ఈ సినిమా చేశారు. వాళ్లకు ఈ కథ చాలా నచ్చింది. ఇది కొత్త తరహా థ్రిల్లర్ అయినప్పటికీ, ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. నేను కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, సినిమా చూస్తున్నప్పుడు కూడా అంతే ఎగ్జైటింగ్‌గా అనిపించింది. రాజేష్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. రవివర్మ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వినయ్ తన పాత్రను చాలా చక్కగా చేశారు. ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. అలాగే కార్తీక్ పాత్ర కూడా చాలా బాగుంటుంది. నేహా పాత్ర కూడా చాలా బాగా కుదిరింది. ఇందులో అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. నిన్న ప్రీమియర్స్‌కు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్‌పై ప్రశంసలు వచ్చాయి. అందుకు మా నిర్మాతలకు, ఈటీవీ విన్‌కు థ్యాంక్స్. ఈ సినిమాకు డీఓపీ మా కజిన్. ఆయన ఈ సినిమాకు ఎంపికైన తర్వాతే నాకు తెలిసింది. మంచి సినిమా చేశాం. ఇది ఫ్యామిలీ డ్రామాతో కూడిన చాలా డిఫరెంట్ థ్రిల్లర్. మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. మన సంస్కృతికి సంబంధించిన అంశాలను, క్యారెక్టర్లను సింబలైజ్ చేస్తూ ఈ సినిమా తీశారు. ఆ అందాన్ని మీరు థియేటర్‌లో చూస్తారు. తప్పకుండా ఈ సినిమాను సపోర్ట్ చేయండి. ఈ సినిమా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచదు.

ఈటీవీ విన్ సాయి కృష్ణ మాట్లాడుతూ: న్యూటన్స్ థర్డ్ లా’ రేపు థియేటర్లలో విడుదలవుతోంది. ఈరోజు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ప్రారంభమవుతాయి. సాధారణ టికెట్ రేట్లతోనే ప్రదర్శిస్తాం. నిన్న జరిగిన ప్రీమియర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈటీవీ విన్ నుంచి వస్తున్న తొలి థ్రిల్లర్ సినిమా ఇది. ఒక తెలుగు దర్శకుడు థ్రిల్లర్ తీస్తే ఎలా ఉంటుందో ఇందులో చూస్తారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.”

దర్శకుడు రాజేష్ కర్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈటీవీ విన్ సాయి గారికి, నిర్మాత హరీష్ గారికి ధన్యవాదాలు. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సుమంత్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్. ప్రమోషన్స్‌లో కూడా ఎంతో ఎఫర్ట్ పెడుతున్నారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఇప్పటికే ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో థ్రిల్, ఎమోషన్, ఎగ్జైట్మెంట్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచదు.”

నిర్మాత హరీష్ మాట్లాడుతూ: ఇప్పటివరకు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. క్వాలిటీ చాలా బాగుందని, కంటెంట్ చాలా బాగుందని చెప్పారు. చివరి వరకు ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఉంటుందని అన్నారు. రేపటి నుంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి సినిమా చేశామని నమ్మకం ఉంది. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. అందరూ కథను నమ్మి ఈ సినిమా చేశారు. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ స్క్రీన్‌ప్లే. తప్పకుండా అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూస్తారని కోరుకుంటున్నాను.

నేహా మాట్లాడుతూ: ఇది నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కచ్చితంగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. థ్రిల్లర్ జానర్‌లో చాలా కొత్తగా ఉండే కంటెంట్ ఇది.

నటుడు రవివర్మ మాట్లాడుతూ: ఈటీవీ వారు ఏ ప్రాజెక్ట్ చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘న్యూటన్స్ థర్డ్ లా’ కూడా చాలా ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు. దర్శకుడు ఈ సినిమాను చాలా కొత్తగా తెరకెక్కించారు. నాకు కూడా చాలా మంచి పాత్ర దక్కింది. సుమంత్ గారు చాలా నేచురల్ పెర్ఫార్మర్. ఆయన నటనలో ఎంతో నిజాయితీ ఉంటుంది. తప్పకుండా ఈ సినిమాను థియేటర్‌లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు.

నటుడు త్రినాథ్ మాట్లాడుతూ: ఈటీవీ విన్ సాయి గారికి థ్యాంక్స్. ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో మరోసారి నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. అలాగే మా నిర్మాత హరీష్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ సినిమా సుమంత్ గారి కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌లలో ఒకటిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. తప్పకుండా అందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.

డీఓపీ వేదవ్యాస్ మాట్లాడుతూ:”నిన్న జరిగిన ప్రీమియర్స్‌కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. జూలై 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

Back To Top