సమంత ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్‌తో దూసుకుపోతున్నారు. ఈక్రమంలో సమంత మరో అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నారు. క్రియేటివ్ కంటెంట్ కోసం…

పోసాని కృష్ణ మురళి *ఆపరేషన్ అరుణారెడ్డి* ట్రైలర్ విడుదల ఈనెల 17 న గ్రాండ్ రిలీజ్
ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ చిత్రం అధికారిక ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17న థియేటర్లలో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ, “ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో వచ్చి సినిమాను వీక్షించి ఆదరించాలని కోరుతున్నాను” అని తెలిపారు.
