ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు…

‘పెద్ది’ బ్రహ్మాండంగా రన్ అవుతోంది.. బుధవారం నుంచి కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నాం: బుచ్చిబాబు సానా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత సతీష్ కిలారు, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, మైత్రీ శశి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
బుచ్చిబాబు గారు.. చరణ్ గారికి ‘పెద్ది’ వంటి అద్భుతమైన సినిమా ఇచ్చారు. మీ తదుపరి సినిమా కూడా చరణ్ గారితోనే ఉంటుందని వింటున్నాం. అది ఎంతవరకు నిజం?
-దేనికైనా సమయమే నిర్ణయిస్తుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. నేను కూడా అది జరగాలని కోరుకుంటున్నాను.
అనంత శ్రీరామ్ గారు.. ‘పెద్ది’లో అన్ని రకాల పాటలు రాశారు. అయితే ఐటెమ్ సాంగ్‌పై కొన్ని విమర్శలు వస్తున్నాయి. దానిపై మీ స్పందన?
-ఐటెమ్ సాంగ్‌ను ఐటెమ్ సాంగ్‌లాగే ఆస్వాదించాలి. విమర్శగానీ, ఆరోపణగానీ నిర్దిష్టంగా ఉండాలి. ప్రత్యేకంగా ఎజెండా పెట్టుకుని మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తాత్వికంగా, తార్కికంగా మాట్లాడితే, ఎవరైనా చేసిన విమర్శలకు నేను నిజాయితీగా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను.
బుచ్చిబాబు గారు.. ‘పెద్ది’ సినిమాలో కొత్త సన్నివేశాలు జోడిస్తున్నారని విన్నాం. ఎప్పటి నుంచి యాడ్ చేస్తారు?
-ఆల్రెడీ ఎడిట్ చేశాం. ఈ బుధవారం నుంచి యాడ్ అవుతాయి. మొత్తం మూడు సన్నివేశాలు జోడించాం. హీరోయిన్‌కు సంబంధించిన మూడు సీన్లు, అలాగే జగపతిబాబు గారికి ఒక సీన్ ఉంటుంది. మిస్ అయిన అంశాలన్నీ అందులో ఉంటాయి.
-95 శాతం మంది ప్రేక్షకులు సినిమాలోని కంటెంట్, కథ గొప్పతనం, రామ్ చరణ్ గారి నటనను ప్రశంసించారు. ఇలాంటి కథలు మరిన్ని రావాలని కోరుకున్నారు. మేము నమ్మిన దానిని ప్రేక్షకులు నిజం చేశారు. మేము వెళ్లిన ప్రతి థియేటర్‌లో అద్భుతమైన స్పందన లభించింది.
-జాన్వీ పాత్రకు సంబంధించి మరో రెండు సన్నివేశాలు ఉన్నాయి. అవి చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ పాత్రకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. బుధవారం నుంచి ఆ సన్నివేశాలు జోడిస్తాం. దాంతో జాన్వీ పాత్ర మరో స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను.
సతీష్ గారు..టికెట్ రేట్లు తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఎక్కువగా చూస్తారు కదా. ఎప్పటి నుంచి తగ్గిస్తారు?
-ఈరోజు నుంచే అన్ని రేట్లు తగ్గించాం. స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.
-‘పెద్ది’ అద్భుతమైన సబ్జెక్ట్. జనాల్లోకి చాలా గ్రాండ్‌గా వెళ్లాలని ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టాం.
శశి గారు నైజాంలో సినిమా ఎలా ఉంది?
-మంచి మోటివేషన్‌తో తీసిన సినిమా. ఈ జనరేషన్‌కు అవసరమైన సినిమా ఇది. ఇలాంటి సినిమా ఇంత కమర్షియల్‌గా రావడం చరిత్రలోనే లేదు. ఇదే మొదటిసారి. ఒక గొప్ప సందేశం ఈ తరం వరకు చేరాలని రామ్ చరణ్ గారు ఈ సినిమా చేశారు. రోజురోజుకీ ప్రేక్షకులు పెరుగుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికీ ఒక పరిష్కారం చూపించే సినిమా. ముఖ్యంగా పిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
బుచ్చిబాబు గారు ఈ సినిమాకు సంబంధించి మీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏది?
-మొన్న నేను కారులో వెళ్తుంటే ఒక ఆటో డ్రైవర్ తన అమ్మగారితో వచ్చి, “చాలా అద్భుతమైన సినిమా తీశావు బాబు. 25 సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్‌కు వచ్చాను” అని చెప్పారు. అది నాకు జీవితాంతం గుర్తుండిపోయే కాంప్లిమెంట్.
రామ్ చరణ్ గారి నటన మరోస్థాయిలో వుంది. దర్శకుడిగా మీరు ఎలాంటి సూచనలు చేశారు?
-చరణ్ గారు అద్భుతంగా చేశారని ప్రేక్షకులు అంటున్నారు. ఆయన అంత గొప్పగా నటించడానికి నేను పెద్దగా ఏమీ చేయలేదు. భోజనం చేస్తున్నప్పుడు తర్వాతి సీన్‌లో ‘పెద్ది’ ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పేవాడిని. “మిగతాదంతా నేను చూసుకుంటాను” అని చరణ్ గారు చెప్పేవారు.
-నేను ఊహించిన ‘పెద్ది’ పాత్రను ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. నటనలో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయారు. ఈ పాత్రలో ఆయన జీవించారనే మాట కూడా తక్కువే. దానికంటే ఎక్కువగా చేశారు.
-బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ విషయంలో నేను ఎలా అనుకుంటున్నానో ఒక స్కెచ్ వేసి చూపించాను. దాన్ని చూసి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని అద్భుతంగా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యి వచ్చారు. ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు.
-చిరంజీవి గారు కూడా “చరణ్ అంత కష్టపడ్డాడు కాబట్టే ఇంత పేరు వచ్చింది” అన్నారు. అలాగే చాలామంది “చరణ్ జీవి” అని చెబుతుండటం ఎంతో ఆనందంగా అనిపించింది.
-సురేఖ గారు సినిమా చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. “చాలా అద్భుతమైన సినిమా తీశావు” అని ప్రశంసించారు.
-సతీష్ గారు ఈ కథను నమ్మి ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన నిర్మాణ విలువలతో సినిమా తీశారు. మేము నమ్మిన దానిని ప్రేక్షకులు కూడా నమ్మారు.
క్లైమాక్స్ గురించి..
-ఈ సినిమా క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కథ వినిపించినప్పుడు చరణ్ గారు కూడా ప్రేక్షకులు ఇప్పుడు ఎలా స్పందిస్తున్నారో అలా స్పందించారు. కథ పూర్తయ్యాక లేచి నన్ను హగ్ చేసుకుని “ఈ సినిమా చేస్తున్నాం” అన్నారు.
-ప్రేక్షకులు ఇలాంటి మంచి మోటివేషన్ వున్న సినిమా ఇంత అద్భుతంగా ఆదరించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
