డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-డ్రామా 'స్లమ్ డాగ్' ఈ చిత్రం…

‘పెద్ది’ బాక్సాఫీస్ ఛాంపియన్‌గా దూసుకెళ్తోంది.. ప్రేక్షకుల ప్రేమకే విజయం అంకితం: నిర్మాత వెంకట సతీష్ కిలారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తూ రికార్డు స్థాయి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమా విజయోత్సాహంలో భాగంగా నిర్వహించిన ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ప్రేమాభిమానాల వల్లే ‘పెద్ది’ ఈ స్థాయి విజయాన్ని అందుకుందని తెలిపారు. తొలి రోజే రూ.135 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఆనందంగా ఉందని, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచేలా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. సినిమా నిర్మాణానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ, ‘పెద్ది’ విడుదలకు ముందే చిత్రంపై ఉన్న నమ్మకం ఇప్పుడు నిజమైందని అన్నారు. ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన స్పందన లభించిందని, రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిందని వెల్లడించారు. బుచ్చిబాబు సానా రాసిన కథకు చరణ్ అసాధారణ నటన ప్రాణం పోసిందని, ప్రేక్షకులు ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఆనందంగా ఉందన్నారు. మల్టిపుల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రం వినోదంతో పాటు స్ఫూర్తిని కూడా అందిస్తుందని చెప్పారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, సినిమా విడుదలైన నాటి నుంచి తనకు వస్తున్న స్పందన ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా ఉందన్నారు. ‘ఉప్పెన’ సమయంలో వచ్చిన ప్రశంసల కంటే పది రెట్లు ఎక్కువ స్పందన ఇప్పుడు వస్తోందని పేర్కొన్నారు. ‘పెద్ది’ పాత్ర ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపుతుండటం సంతోషంగా ఉందని, ఈ విజయానికి ప్రధాన కారణం రామ్ చరణ్ అంకితభావం, కష్టమేనని చెప్పారు. ప్రేక్షకులు తమ నమ్మకాన్ని నిజం చేశారని, రాబోయే రోజుల్లో సినిమా మరింత పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
డిస్ట్రిబ్యూటర్ శశిధర్ మాట్లాడుతూ, మీడియా, ప్రేక్షకుల మద్దతు వల్లే ‘పెద్ది’ ఈ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. రామ్ చరణ్ ఈ పాత్ర కోసం చేసిన కృషి తెరపై స్పష్టంగా కనిపిస్తోందని, ఫస్ట్ డే కలెక్షన్లతోనే కొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా ‘పెద్ది’ నిలుస్తోందని, ప్రేక్షకుల ఆదరణకు చిత్ర బృందం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు.

Comments (0)