I am text block. Click edit button to change this text. Lorem ipsum dolor sit…

నయనతార–కవిన్ ‘హాయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆగస్టు 14న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్!
లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ హీరో కవిన్ తొలిసారి జంటగా నటిస్తున్న ‘హాయ్’ విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేస్తూ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
నూతన దర్శకుడు విష్ణు ఎడ్విన్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, ప్రభు, రాధిక శరత్‌కుమార్, వీటీవీ గణేష్, సత్యన్, ఆదిత్య కదిర్, ఖురేషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాజేష్ శుక్లా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జెన్ మార్టిన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, ఎస్. కన్నన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నయనతార, విగ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. వినోద్ సి.జె, కె.ఎస్. మయిల్ వాగనన్ సహ నిర్మాతలుగా, వి.కె. కుబీంద్రన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్‌కు డిజిటల్ వేదికలపై మిలియన్ల వ్యూస్ రావడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఆ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ఇప్పుడు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
దర్శకుడు విష్ణు మాట్లాడుతూ.. “‘హాయ్’ టైటిల్‌కు తగ్గట్టుగానే ఇది చాలా సింపుల్, హార్ట్‌వార్మింగ్, ఫీల్‌గుడ్ సినిమా. ప్రతి కుటుంబం కలిసి చూసి ఎంజాయ్ చేసేలా రెండున్నర గంటల పూర్తి వినోదాన్ని అందించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యంలో సాగే ఈ కథలో హాస్యం, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’, ‘సంతోష్ సుబ్రహ్మణ్యం’, ‘యారడి నీ మోహిని’ తరహాలో సాంప్రదాయ విలన్ లేకుండా సాగే పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది” అని అన్నారు.
‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు దర్శకుడు లోకేష్ కనగరాజ్తో కలిసి పనిచేసిన విష్ణు , *’హాయ్’*తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నయనతార-కవిన్ తొలి కాంబినేషన్, బలమైన నటీనటులు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ‘హాయ్’ ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.
