Skip to content

నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి డివైన్ వైబ్స్.. దసరా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వృషకర్మ’ విభిన్నమైన నేపథ్యంతో రూపొందుతున్న మైథలాజికల్ థ్రిల్లర్. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి రూపొందిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తుండగా, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం తాజాగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో నాగచైతన్య గుబురు గడ్డంతో, నుదుటిపై ఎర్రటి తిలకంతో ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన ముఖంలో ఒక భాగం చీకటిలో ఉండటం పాత్రలోని మిస్టరీని మరింత పెంచుతోంది. ఆయన ముందు సంప్రదాయ ఆభరణాలు, ఎరుపు-బంగారు రంగుల చీరతో అలంకరించిన దేవతా విగ్రహం కనిపిస్తోంది. ఆ విగ్రహం చేతిలో బంగారు శూలం ఉంది. అగ్నిని తలపించే ఎరుపు రంగులు, నుదుటిపై తిలకం, బంగారు కాంతుల కలయిక పోస్టర్‌కు పవర్ ఫుల్ లుక్ తీసుకొచ్చాయి. మొత్తంగా ఈ పోస్టర్ దివ్యమైన ఆధ్యాత్మిక వైబ్స్‌తో ఆకట్టుకుంటోంది.

‘వృషకర్మ’ నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం. ఇందులో తన సాహసోపేతమైన పాత్రకు తగినట్లుగా ఆయన పూర్తిగా కొత్త లుక్‌లోకి మారారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నారు. జయరామ్, బేబీ కియారా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి రాగుల్ డి. హెరియన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ‘వృషకర్మ’పై అంచనాలు పెరిగాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.

నటీనటులు నాగచైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, బేబీ కియారా
దర్శకత్వం కార్తీక్ దండు
నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్
బ్యానర్లు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్
సమర్పణ బాపినీడు
సహ నిర్మాతలు ఇషాక్ సక్సేనా, అశోక్ బండ్రెడ్డి
సంగీతం అజనీష్ బి. లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీ రాగుల్ డి. హెరియన్
ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల
ఎడిటర్ నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నరసింహ చారి చెన్నోజు
మార్కెటింగ్ హ్యాష్‌ట్యాగ్ మీడియా
Back To Top