కలలు, పట్టుదల, భారతీయ స్ఫూర్తికి ప్రతీకగా అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై తెలుగు మూలాలున్న రాజ్ దాసిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు…

నవంబర్ 13న మాయలేడి గ్రాండ్ రిలీజ్!
యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ రోజు “మాయలేడి” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. నవంబర్ 13న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ప్రమోషనల్ కంటెంట్ తో “మాయలేడి” సినిమా ఇప్పటికే మూవీ లవర్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్, టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. థియేటర్స్ లోనూ ప్రేక్షకుల నుంచి ఇలాంటి ఆదరణే తమ సినిమాకు దక్కుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు మూవీ టీమ్.
| మాయలేడి మూవీ వివరాలు | |
|---|---|
| నటీనటులు | రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, తదితరులు |
| మ్యూజిక్ | విశాల్ చంద్రశేఖర్ |
| బ్యానర్ | క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ |
| ప్రొడ్యూసర్ | రాకేష్ వర్రే |
| స్క్రిప్ట్, డైరెక్షన్ | ప్రశంకర్ |
| పీఆర్ఓ | సురేష్ (ఎస్ కె మీడియా) |
