ఈ నెల 22న ప్రీమియర్ కు వస్తున్న "నా వైఫ్ మిస్సింగ్" వెబ్ సిరీస్.....ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్…

జె యస్ యస్ వర్ధన్
అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ది ట్రేటర్స్ షో ఇప్పటికే ఆరు ఉత్కంఠభరితమైన ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ ఊహించని మలుపులు, ఆసక్తికరమైన వ్యూహాలు, మైండ్ గేమ్స్‌తో షో మరింత ఉత్కంఠగా ముందుకు సాగుతోంది.
“ట్రైటర్స్” (Traitors) తెలుగు ప్రముఖ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అవుతోంది. రెగ్యులర్ రియాలిటీ షోస్‌కి భిన్నంగా చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా. కాన్సెప్ట్, సెటప్, ప్రెజెంటేషన్ అన్నీ కొత్తగా ప్లాన్ చేశారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదొ తర్వాత ఏం జరుగుతుందో ఊహించలేని విధంగా గేమ్‌లో ట్విస్టులు మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఎవ్రిథింగ్ ఈజ్ లవ్ , ఎఫక్షన్ & ట్రైటర్స్
హోస్ట్‌గా తేజ సజ్జ కూడా చాలా స్టైలిష్ గా, మెచ్యూర్డ్‌గా, సోనీ హ్యాండిల్ చేశాడు. ఇలాంటి డిఫరెంట్ ఫార్మాట్‌కి తేజ పర్ఫెక్ట్ ఛాయిస్ అనేలా చేసాడు.
ఎవరికివారు పోటాపోటీగా ఆడుతున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జె.ఎస్.ఎస్. వర్ధన్ గురించి! తన బుద్ధిబలంతో పాటు కండబలాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. గీతా సుబ్రహ్మణ్యం లాంటి విజయవంతమైన సిరీస్ ని, హలో వరల్డ్ లాంటి ట్రెండీ వెబ్ సిరీస్ ను, అలాగే రాజ్ తరుణ్ తోభలే ఉన్నాడే, అంకిత్ కోయ తో బ్యూటీ లాంటి సినిమాలకి రచన దర్శకత్వం వహించిన జె యస్ యస్ వర్ధన్ “ట్రైటర్స్” లాంటి సిరీస్ లో తనదైన శైలితో చాకచక్యంగా, చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకునేలాగా ఆడారు. ఇది ఒక డిఫరెంట్ మైండ్ గేమ్. ఇలాంటి గేమ్ లో ఆడి ఆదరణ పొందడం సాధారణ విషయం కాదు. ప్యాలెస్ లో వెళ్లిన 20 మంది కంటెస్టెంట్లలో తనదైన ముద్ర వేసుకున్నారు వర్ధన్.
ఇక్కడ ఎవ్రీ మూవ్ ఈజ్ రిస్క్, ఔట్ కమ్ ఆల్వేస్ ట్విస్ట్ అని తెలిసినా ప్యాలెస్ లోకి ఎంటర్ అవడానికి ముందే ఫిల్టర్ లెస్ ఫేస్ అని చిన్మయి గారిని సెలెక్ట్ చేసింది కూడా వర్ధన్ గారు. అదేవిధంగా ఇన్నోసెంట్ గా ఉంటూ “ట్రైటర్స్” ఎవరు అని ఆలోచించడంలో ఆయన యొక్క తెలివితేటలు మనకు కనబడతాయి. ముఖ్యంగా, గౌరవ్ ట్రేటర్ కాదని నమ్మి, అతనికి మద్దతుగా నిలిచిన అతి కొద్దిమందిలో వర్ధన్ ఒకరు! తన తోటి కంటెస్టెంట్స్ చిన్మయి, నిఖిల్, గౌరవ్‌లను ట్రేటర్స్ చంపడంతో, దానికి ప్రతీకారంగా విద్యులేఖను ట్రేటర్‌గా గుర్తించడంలో వర్ధన్ కీలక పాత్ర పోషించారు. తన బుద్ధిబలంతో సరైన వ్యూహాన్ని అమలు చేసి, విజయవంతంగా రింగ్ ఆఫ్ డౌట్లో విద్యులేఖను ట్రేటర్స్ షో నుంచి ఎలిమినేట్ చేయడంలో ముఖ్యపాత్ర వహించారు!
అదేవిధంగా ప్యాలెస్ లో జరిగే ఆక్టివిటీస్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ టాప్ పెర్ఫార్మర్ గా అందరినీ మెప్పిస్తున్నారు. ఎలాంటి ఆక్టివిటీ ఇచ్చిన సక్సెస్ ఫుల్ గా చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
ఉన్న అందరి కంటెస్టెంట్స్ లో బుద్ధి, బలం ఉన్న వ్యక్తి వర్ధన్. తన బుద్ధి బలంతో స్ట్రాటజీలతో ట్రైటర్స్ ని కనిపెట్టడం కోసం చాలా కృషి చేశాడు. తన భుజబలంతో ఉన్న గేమ్స్ నీ కూడా చాలెంజ్ గా తీసుకుని ఆడడంలో ముందున్నాడు.
ప్రసారమైన 4, 5, 6 ఎపిసోడ్లలో ప్రతి పార్టిసిపెంట్ నోటా వినిపించిన పేరు వర్ధన్! అందరూ ఆయన్ని ఒక స్ట్రాంగ్ ప్లేయర్‌గా గుర్తిస్తున్నారు. అదే సమయంలో, హిట్ లిస్ట్‌లో కూడా వర్ధన్ పేరు ప్రధానంగా కనిపిస్తోంది.
అసలైన ట్రేటర్ అయిన రాహత్‌ను షో నుంచి బయటకు పంపించేందుకు అతను అనుసరించిన వ్యూహాలను, మోనిషాను రాహత్ ఎందుకు ఎంచుకున్నాడనే విషయాన్ని గేమ్‌లోని పార్టిసిపెంట్స్ అందరికీ వివరంగా విశ్లేషించి చెప్పిన ఏకైక వ్యక్తి వర్ధన్!
ఓట్ల లెక్కింపులో మోనిషా తనకు వ్యతిరేకంగా ఉందని తెలిసినా, ఆటలో మోనిషాను గెలిపించి, ఆమెను కాపాడి, తన వైపు తిప్పుకోవాలనే వ్యూహంతోనే రాహత్ ఆమెను ఎంచుకున్నాడనే విషయాన్ని వర్ధన్ స్పష్టంగా వివరించారు. ఇతరులు గమనించని ఈ వ్యూహాన్ని తన బుద్ధిబలంతో విశ్లేషించి, రాహత్ అసలు గేమ్ ప్లాన్‌ను అందరికీ అర్థమయ్యేలా చెప్పి, రాహత్‌ను షో నుంచి బయటకు పంపించడంలో కూడా కీలక పాత్ర పోషించారు!
లాస్ట్ ఎపిసోడ్ మాత్రం next లెవెల్…అందరూ యస్ యస్ వర్ధన్ వెళ్లిపోతాడు అనుకుంటే , Raahat వెళ్ళిపోవడం …అసలు ప్లేయర్స్ కి గానీ , ఆడియన్స్ కి గానీ గేమ్ లో ఏమి జరుగుతుందో ..ఏమి అర్ధం కాలేదు…పొద్దునే లేచి టిఫిన్ తినడం ఇంత భయంకరం గా ఉంటుందా !! అనేది ప్రతి ప్లేయర్ కి ఉంది. ఇదిలా ఉంటే ఈ షో చూస్తున్న వాళ్ళకి ట్రైటర్స్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ను టార్గెట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు.. ఇక 6 వ ఎపిసోడ్ ఎండింగ్ ట్విస్ట్ ఎవరికీ అర్ధం కాలేదు.. యస్ యస్ వర్ధన్ స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు అయితే ఇతనే ట్రైటర్ హర్ష వర్ధన్ అందరికీ చెప్పడం జరిగింది.కానీ అక్కడ అలా జరగపోవడమే గేమ్ లో గొప్పతనం.
ఇప్పటి వరకూ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ అయిన 6 ఎపిసోడ్స్ ఒక ఎత్తు అయితే, లాస్ట్ ఎపిసోడ్ మాత్రం next లెవెల్…అందరూ సాయి వర్ధన్ వెళ్లిపోతాడు అనుకుంటే , Raahat వెళ్ళిపోవడం …అసలు ప్లేయర్స్ కి గానీ , ఆడియన్స్ కి గానీ గేమ్ లో ఏమి జరుగుతుందో ..ఏమి అర్ధం కాలేదు…పొద్దునే లేచి టిఫిన్ తినడం ఇంత భయంకరం గా ఉంటుందా !! అనేది ప్రతి ప్లేయర్ కి ఉంది. ఇదిలా ఉంటే ఈ షో చూస్తున్న వాళ్ళకి ట్రైటర్స్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ను టార్గెట్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు.. ఇక 6 వ ఎపిసోడ్ ఎండింగ్ ట్విస్ట్ ఎవరికీ అర్ధం కాలేదు… “మై డియర్ ట్రేటర్… దమ్ముంటే ఈరోజు రాత్రి నన్ను బతికించు! రేపు మాత్రం నేను నిన్ను చంపేస్తా!! అని ఎందుకు అన్నారు.. నెక్స్ట్ ఎపిసోడ్ లో యస్ యస్ వర్ధన్ ఉంటారా ? వెళతారా ? అప్పటికే హిట్ లిస్ట్‌లో ఉన్న వర్ధన్‌ను మిషన్‌లో కూడా ఎవరూ కాపాడలేకపోవడంతో, శ్రావ్య, ధనుంజయ లతో పాటు వర్ధన్ కూడా ఆషికా కత్తికి దగ్గరయ్యారు. ఈ ముగ్గురిలో ఎవరు షో నుంచి ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ ఆసక్తికరమైన ఉత్కంఠకు తెరపడాలంటే వచ్చే గురువారం వరకు వేచి చూడాల్సిందే!
