Skip to content
Movie Schedules

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా ‘పెద్ది’ 6 రోజుల్లో పూర్తి కానున్న షూటింగ్

April 26, 20261 second read

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషనల్ కంటెంట్ తో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా సంచలనం సృష్టించాయి. రెండు గ్లింప్స్‌లలో రామ్ చరణ్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించి మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ బర్త్ స్పెషల్ గా విడుదలైన గ్లింప్స్‌ ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇంకో 6 రోజుల్లో పూర్తవనుంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ జరుగుతున్నాయి. ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమంగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాడమే లక్ష్యంగా మేకర్స్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా జూన్‌లో థియేటర్లలో విడుదల కానుంది.

సెట్స్ నుంచి విడుదలైన కొత్త స్టిల్స్‌లో షూటింగ్ స్పాట్‌లోని పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తోంది. దర్శకుడు బుచ్చి బాబు సానాతో కలిసి రామ్ చరణ్ ఆనందంగా కనిపిస్తూ, షూట్ వాతావరణాన్ని తెలియజేస్తున్నారు. చరణ్ లుక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. పొడవాటి జుట్టు, గడ్డం, స్టైలిష్ షేడ్స్‌తో రగ్గడ్ అవతార్‌లో కనిపించడం పాత్రలో ఇంటెన్సిటీని ప్రజెంట్ చేస్తోంది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి అద్భుతమైన తారాగణం కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీని, ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించగా, నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.

తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సన
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top