Skip to content
Movies

నాలుగు రోజుల్లో రూ. 4.8 కోట్ల గ్రాస్ కలెక్ష‌న్స్ సాధించి స‌త్తా చాటిన ధ‌నుష్ ‘కర’

May 4, 20265 second read

ధనుష్, మమితా బైజు జంటగా కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఐషరి కె. గణేష్ నిర్మించిన చిత్రం ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న తెలుగు రాష్ట్రాల్లో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ బ్యానర్ మీద సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేశారు. రిలీజ్ రోజు నుంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌తో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే సినిమా రూ.4.8 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించటం విశేషం.

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాల‌తో త‌న‌దైన స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధ‌నుష్ ‘క‌ర‌’ సినిమాతో మ‌రో విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. మ‌మితా బైజు బెస్ట్ పెర్ఫామెన్స్‌తో ఆడియెన్స్‌ను అల‌రించింది. ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ పాత్ర హృద్యంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌న దేశంలో పంట‌లు పండించే రైతులు ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అలాంటి వాటిలో ఓ స‌మ‌స్య‌ను ఇతివృత్తంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ రాజా. జివి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం, తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మేజ‌ర్ హైలైట్స్‌గా నిలిచాయి.

ధ‌నుష్ క‌ర‌సామి పాత్ర‌లో ఒదిగిపోయిన తీరుకి ఆడియెన్స్ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. గ్రిప్పింగ్, థ్రిల్లింగ్, హై ఇంటెన్ష‌న్ స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కులు సినిమాను ఆసాంతం ఎంజాయ్ చేస్తున్నారు.

నటీనటులు : ధనుష్, మమితా బైజు, కె.ఎస్‌.ర‌వికుమార్‌, సూరజ్ వెంజరమూడు, జ‌యరాం తదితరులు

సాంకేతిక బృందం:
బ్యానర్ : విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ – ఆర్ స్టార్ లాజిస్టిక్స్
రచన : విఘ్నేశ్ రాజా, ఆల్‌ఫ్రెడ్ ప్రకాష్
దర్శకుడు : విఘ్నేశ్ రాజా
సంగీతం : జీవీ ప్రకాష్
డీఓపీ : థేనీ ఈశ్వర్
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
కార తెలుగు రిలీజ్: విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్
పీఆర్వో (తెలుగు): బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి)
డిజిటల్ మార్కెటింగ్ (తెలుగు) : విష్ణు తేజ్ పుట్టా
ఈవెంట్ పార్టనర్ (తెలుగు) : యు వి మీడియా

Share this Article

Related Articles

No Comments

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top