తెలుగు సిల్వర్ స్క్రీన్‌పైకి మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి అభిషేక్ నిర్మాణంలో, డైరెక్టర్ గొండి…

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘చోర శికామణులు’

శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్న చిత్రం ‘చోర శికామణులు’. ఆనంద్ కుర్మా ఈ మూవీకి కథ, కథనం, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్లో రానున్న ఈ మూవీలో రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు.
‘చోర శికామణులు’ చిత్ర ప్రారంభోత్సవం, పూజా కార్యక్రమాలకు త్రినాథరావు నక్కిన, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆనంద్ రాజావిక్రమ్ సంగీత దర్శకుడిగా, జగదీష్ కొమరి కెమెరామెన్‌గా, యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలను డ్రాగన్ ప్రకాష్ నిర్వహించనున్నారు.
జూలై 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మంచి సాంగ్‌తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని టీం తెలిపింది. మున్ముందు మరిన్ని అప్డేట్లతో మేకర్స్ అంచనాలు పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు.
| నటీనటులు | |
|---|---|
| రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ తదితరులు. | |
| సాంకేతిక నిపుణులు | |
| సమర్పణ | శ్రీకరి-వివాన్ |
| బ్యానర్ | శ్రీకరి క్రియేషన్స్ |
| నిర్మాత | బానూరు నాగరాజు |
| కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం | కూర్మ ఆనంద్ |
| సంగీత దర్శకుడు | ఆనంద్ రాజవిక్రమ్ |
| ఎడిటర్ | శ్రీకాంత్ (K.G.F) |
| ఫైట్స్ | డ్రాగన్ ప్రకాష్ |
| పీఆర్వో | సాయి సతీష్ |
